గతంలో తమ టాలెంట్ నిరూపించుకునేందుకు సరైన వేదిక యువతీ, యువకులు చాలా ఇబ్బందిపడేవాళ్లు. అయితే సోషల్ మీడియా వచ్చాక ఆ సమస్య నామరూపాలు లేకుండా పోయింది. ఇంట్లో కూర్చుని తమ నైపుణ్యాలను వీడియోల రూపంలో షేర్ చేస్తూ కొంతమంది రాత్రి రాత్రి సెలబ్రిటీలుగా అయిపోయినవాళ్లు కూడా ఉన్నారు . ఈ తరహాలోనే ఇటీవల తన గొంతుతో ప్రజలను ఆకట్టుకుంటూ ఫేమస్ అయ్యాడు బీహార్ కి చెందిన అమర్జీత్ జైకర్ అనే యువకుడు. తాజాగా అతడు హిమేష్ రేషమ్మియ కంపోజ్ చేసిన న్యూ ట్రాక్‌ను ఆలపించాడు.
ఇటీవల ‘దిల్ దే దియా హై’ పాట పాడిన జైకర్ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అలాగే ఈ వీడియో సోనూసూద్‌తో పాటు కొంతమంది బాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. దీంతో అతను జైకర్‌కి తన రాబోయే చిత్రం ఫతేలో పాడే అవకాశం కూడా ఇచ్చాడు. తాజాగా హిమేష్ రేషమ్మియ రాసి, కంపోజ్ చేసిన లేటెస్ట్ ట్రాక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు మళ్లీ ఈ బీహారీ బాలుడు ఆయన రాసిన తన కొత్త పాట వీడియోను పంచుకున్నాడు. ఈ పాట విన్న నెటిజన్లు అమర్జీత్ జైకర్ సింగింగ్ ప్రతిభకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
#DilKiiDeewaaronPe2.0 composed and written by Himesh Reshammiya and sung by Amarjeet Jaikar out now❤️#HimeshReshammiya #AmarjeetJaikar #HimeshKeDilSe #HimeshReshammiyaMelodies pic.twitter.com/hZI9j9LB8E
— Amarjeet Jaikar (@AmarjeetJaikar3) April 12, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..