Railway News: గుడ్‌న్యూస్‌.. ఈ రైలు ఎక్కితే నో టికెట్.. నో ఫైన్..

|

May 04, 2022 | 7:10 PM

మన దేశంలో రైలు ప్రయాణం అంటే ఎంతో చౌకైనది.. సుఖవంతమైనది.. కోట్లాది మంది ప్రజలు ప్రతీ రోజూ రైళ్లలో తమ గమ్యస్థానాలకు..

Railway News: గుడ్‌న్యూస్‌.. ఈ రైలు ఎక్కితే నో టికెట్.. నో ఫైన్..
Railway
Follow us on

మన దేశంలో రైలు ప్రయాణం అంటే ఎంతో చౌకైనది.. సుఖవంతమైనది.. కోట్లాది మంది ప్రజలు ప్రతీ రోజూ రైళ్లలో తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్, శతాబ్ధి, హంసఫర్, గరీభ్‌‌రథ్, వందేభారత్ వంటి ఎన్నో రకాల రైళ్లు ఉన్నాయి. అయితే వీటిలో ప్రయాణించాలంటే టికెట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ మనదేశంలో టికెట్ అవసరం లేకుండా.. ఉచితంగా ప్రయాణించగలిగే.. రైలు ఒకటి ఉంది..ఆ ట్రైయిన్‌లో టికెట్‌ ఫ్రీ..ఎలాంటి ఫైన్‌ కూడా ఉండదు..అదే భాక్రా నంగల్‌ రైలు..

 

హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సరిహద్దుల్లో ఉన్న 13 కి.మీ. రైలు మార్గంలో ఈ ట్రైన్ నడుస్తుంది. ఇది సట్లెజ్ నది గుండా వెళుతుంది. నంగల్ నుండి ఉదయం 7గంటల 5నిమిషాలకు ఈ రైలు బ‌య‌ల్దేరుతుంది. సుమారు 8గంటల 20నిమిషాలకు ఈ రైలు భక్రా నుండి నంగల్‌కు తిరిగి వస్తుంది. నంగల్ నుండి భాక్రా డ్యామ్ చేరుకోవడానికి రైలు దాదాపు 40 నిమిషాలు నడుస్తుంది. ఈ రైలును భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు నిర్వహిస్తోంది. కొండకోనలు, నదుల సోయగాల మధ్య రైలు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రైలులో వెళ్లే ప్రయాణికుల నుంచి ఎలాంటి ఛార్జీలను వసూలు చేయరు.

ఇవి కూడా చదవండి

 

ఈ రైలు పూర్తిగా డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుంది. రైలును ప్రారంభించినప్పుడు అందులో 10 కోచ్‌లు నడిచేవట, ప్రస్తుతం 3 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ రైలులో ఒక కోచ్‌ను పర్యాటకులకు, మరొకటి మహిళలకు కేటాయించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే…ఈ రైలులోని అన్ని కోచ్‌లు చెక్కతో తయారు చేశారు. భాక్రా-నంగల్ ఆనకట్టను వారసత్వ సంపదగా భావిస్తారు. అందుకే ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.