
ఫ్లైఓవర్ పిల్లర్, వంతెన మధ్యలో కొంత ఖాళీ స్థలం ఉంటుంది.. ఇది దాదాపుగా అందరూ చూసే ఉంటారు. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి అలాంటి ఖాళీ స్థలంలో హాయిగా సేద తీరుతూ కనిపించాడు. ఆ మార్గంలో వెళ్తున్న కొందరు వాహనదారులు అతన్ని గమనించి ఫోటోలు, వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో ఐటి రాజధాని బెంగళూరులోని జలహళ్లి క్రాస్ ప్రాంతంలో జరిగిన సంఘటనగా తెలిసింది. వీడియో వైరల్‌గా మారడంతో పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. ఫ్లైఓవర్ పిల్లర్‌పై ఉన్న ఖాళీ స్థలంలో ఆ వ్యక్తి హాయిగా నిద్రపోతూ కనిపించాడు. ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డుపై సదరు వ్యక్తి ఎలా అంతపైకి ఎక్కగలిగాడు అన్నది చాలా మంది వ్యక్తం చేస్తున్న సందేహం.
వైరల్ వీడియోలో మెట్రో ఫ్లైఓవర్ పిల్లర్ ఖాళీ స్థలంలో ఆ వ్యక్తి హాయిగా నిద్రపోతూ కనిపించాడు. అతన్ని చూసిన ప్రత్యక్షసాక్షులు, వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి ఆ ప్రదేశానికి ఎలా చేరుకున్నాడో అని ఆలోచిస్తున్నారు. ఇరుకైన ప్రదేశంలో స్తంభం పైన పడుకున్న వ్యక్తిని వీడియోలో మీరు చూడవచ్చు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను తెలుపుతూ కామెంట్ చేశారు.
ఈ వీడియోను @karnatakaportf అనే ఖాతా నుండి సోషల్ సైట్ Xలో షేర్ చేశారు. వీడియో క్యాప్షన్‌లో ఇలా ఉంది, “జాలహల్లి క్రాస్ వద్ద ఫ్లైఓవర్ పిల్లర్‌పై ఒక వ్యక్తి ఇలా నిద్రపోతున్నాడు. అని రాసి ఉంది. ఈ వింత దృశ్యాన్ని చూసి ప్రజలు షాక్ అయ్యారు. అతను ఇంత ఇరుకైన, ప్రమాదకరమైన ప్రదేశంలోకి ఎలా వచ్చాడు? అంటూ చాలా మంది ప్రశ్నించారు. కాగా, ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. వందలాది లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. నగరంలో నిరాశ్రయుల సమస్య తీవ్రంగా ఉందని కొందరు అంటున్నారు. వారికి నివసించడానికి స్థలం దొరకడం లేదు, అందుకే వారు అలాంటి ప్రమాదకరమైన ప్రదేశాలలో ఆశ్రయం పొందుతున్నారంటూ ఇంకొందరు రాశారు.
Desperation or Neglect? Man Found Sleeping Inside Flyover Pillar at Jalahalli Cross Highlights Harsh Reality of Urban Poverty
A shocking incident was reported from Jalahalli Cross, where a man was found sleeping inside a hollow section of a flyover pillar. The bizarre sight… pic.twitter.com/s6EWWLnqcO
— Karnataka Portfolio (@karnatakaportf) November 11, 2025
ఈ వీడియోలో బెంగళూరు పోలీసులను చాలా మంది ట్యాగ్ చేయడంతో వారు చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు పీన్యా పోలీస్ స్టేషన్‌ను ఆదేశించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దింపారు. అతను ఎవరు, అక్కడ ఎందుకు నిద్రపోతున్నాడో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..