Viral: లేటైన ఫుడ్ ఆర్డర్.. డెలివరీ బాయ్‌పై గుస్సా.. తీరా అతడిని చూడగానే దెబ్బకు ఫ్యూజులౌట్!

|

Aug 13, 2022 | 1:12 PM

అరగంట దాటింది.. గంట కావొస్తోంది.. ఇంటికి రావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఆలస్యమైంది. ఒక పక్కన ఆకలి.. మరోపక్క డెలివరీ బాయ్‌పై గుస్సా..

Viral: లేటైన ఫుడ్ ఆర్డర్.. డెలివరీ బాయ్‌పై గుస్సా.. తీరా అతడిని చూడగానే దెబ్బకు ఫ్యూజులౌట్!
Reperesentative Image
Follow us on

అది బెంగళూరు.. రోహిత్ కుమార్ అనే వ్యక్తి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. అరగంట దాటింది.. గంట కావొస్తోంది.. ఇంటికి రావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఆలస్యమైంది. ఒక పక్కన ఆకలి.. మరోపక్క డెలివరీ బాయ్‌పై రోహిత్‌కి పట్టరాని కోపం వస్తోంది. ఇంతలో డెలివరీ బాయ్ వచ్చి తలుపు తట్టాడు. ఆర్డర్ లేట్ అయినందుకు అతడ్ని తిట్టాలనుకుంటే రోహిత్ డోర్ ఓపెన్ చేయగా.. అవతల వైపు ఉన్న డెలివరీ బాయ్‌ను చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగింది.!

రోహిత్ డోర్ ఓపెన్ చేయగానే.. అవతల వైపు డెలివరీ బాయ్ రెండు ఊతకర్రల సాయంతో చిరునవ్వు నవ్వుతూ ఆర్డర్ పట్టుకుని కనిపించాడు. ఆయన వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుంది. అంతే! ఆయన్ని చూడగానే రోహిత్ సిగ్గుతో తలదించుకున్నాడు. వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పి.. మాట కలిపాడు. ఇక ఈ ఘటనను తన ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు.

కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయారు..

‘నా ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసిన ఆయన పేరు కృష్ణప్ప రాథోడ్. కేఫ్‌లో పని చేస్తుండేవారు. అయితే కరోనా కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఆర్ధిక స్తోమతి అంతంతమాత్రంగా ఉండటంతో.. తన కుటుంబాన్ని పోషించేందుకు ఇలా డెలివరీ బాయ్‌గా మారారు. తెల్లారగానే తన ఉద్యోగాన్ని మొదలు పెడతారు.. రాత్రి పొద్దుపోయేదాకా డెలివరీలు అందజేసి ఇంటికి చేరుకుంటారు. ఈయనకు ఎవరైనా సరే.. తమకు తోచిన సాయం చేయాలంటూ’ రోహిత్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా, రోహిత్ పోస్ట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. కొంతమంది కృష్ణప్ప రాథోడ్‌కు డబ్బులు డొనేట్ చేయగా.. మరికొందరు ఆయన ఆత్మవిశ్వాసానికి ప్రశంసలు కురిపించారు.(Social Media Post)

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..