బాబోయ్‌.. తియ్యటి బెల్లంలో కల్తీ విషం..! ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్ధారణ.. ఎక్కడంటే..

|

Sep 25, 2024 | 7:22 AM

అవును, పానీపూరీ, గోబీ మంచూరి, కబాబ్‌లు, కాఫీ పౌడర్‌లలో రసాయనాల వాడకం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆహార నాణ్యతా విభాగం కూడా బెల్లంలో కల్తీ రంగును వాడినట్లు నిర్ధారణ అయింది. బెల్లంలో కృత్రిమ రంగులు వాడుతున్నారని ఫుడ్ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్‌ గుర్తించింది.

బాబోయ్‌.. తియ్యటి బెల్లంలో కల్తీ విషం..! ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్ధారణ.. ఎక్కడంటే..
Chemicals Used In Jaggery
Follow us on

బెల్లంలో కల్తీ రసాయనాలు వాడినట్లు నిర్ధారణ అయింది..అవును, తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించారనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కల్తీ వ్యవహారం ప్రజల్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఏం తినేట్టు లేదు.. ఏం కొనేట్టు లేదు అన్నట్టుగా మారింది పరిస్థితి అంటూ ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇందులో భాగంగా చక్కెర వాడకాన్ని చాలా వరకు తగ్గించేస్తున్నారు. చక్కెరకు బదులుగా బెల్లాన్ని వినియోగిస్తున్నారు. కానీ, తీపిని పంచే బెల్లం ఇప్పుడు కల్తీమయంగా మారిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.

ఐటీ రాజధాని బెంగుళూరులో ఈ కల్తీ బెల్లం కథ తాజాగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఆహార పదార్థాల్లో కెమికల్ కలర్ వాడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో మనం తీసుకునే ఆహారం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే సందేహాలు మొదలయ్యాయి. అవును, పానీపూరీ, గోబీ మంచూరి, దూది, కబాబ్‌లు, కాఫీ పౌడర్‌లలో రసాయనాల వాడకం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆహార నాణ్యతా విభాగం కూడా బెల్లంలో కల్తీ రంగును వాడినట్లు నిర్ధారణ అయింది. బెల్లంలో కృత్రిమ రంగులు వాడుతున్నారని ఫుడ్ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్‌ గుర్తించింది.

కొద్దిరోజుల క్రితం ఫుడ్ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ వారు వివిధ రకాల బెల్లం సేకరించి ల్యాబ్ రిపోర్టుకు పంపారు. ఈ సందర్భంలో బెల్లంలో కృత్రిమ రంగు వాడినట్లు తేలింది. మీరు అటువంటి బెల్లం వాడటం కొనసాగిస్తే, మీ ఆరోగ్యంపై ప్రాణాంతక ప్రభావాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. దీంతో ఏం తినేట్టు లేదు.. ఏం కొనేట్టు లేదు తమ పరిస్థితి అంటూ ప్రజలు వాపోతున్నారు. దేవాలయాల్లో ప్రసాదం కోసం బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి బెల్లం వాడకాన్ని కూడా ఎప్పటికప్పుడు చెక్‌ చేయాలంటున్నారు ప్రజలు. ఆఖరుకు తీపిని పంచే బెల్లాన్ని కూడా విషంగా మార్చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల ఆహార పదార్థాల్లో కల్తీ ముప్పు రోజు రోజుకూ పెరిగిపోతోందని, ఇలాంటి కల్తీ కేటుగాళ్లపై ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..