Bengaluru boy brutally beaten by BBMP officials: దేశంలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా చేపడుతున్నాయి. కానీ కొన్నిచోట్ల ఇప్పటికీ కరోనా టెస్ట్‌లు చేయించుకోవటానికి జనాలు ముందుకు రావటం లేదు. అటువంటి వారి పట్ల బెంగళూరు అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులోని నాగరత్‌పేట్ టెస్టింగ్ కేంద్రంలో టీకా కోసం వచ్చిన ఇద్దరు యువకులు చాలా సేపు లైన్‌లో వెయిట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత అది టీకా కేంద్రం కాదు, కొవిడ్ పరీక్షా కేంద్రం అని తెలిసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అది గమనించిన బీబీఎంబీ సిబ్బంది.. వారిని టెస్టు చేయించుకోవాలని కోరారు. కోవిడ్ టెస్ట్ చేసుకునేందుకు ఆ యువకులు నిరాకరించారు. తమకు కోవిడ్ లక్షణాలు లేవంటూ ఓ యువకుడు అధికారులకు సమాధానం చెప్పాడు. అయినా.. ఆ సిబ్బంది వినిపించుకోకుండా యువకుడిని దారుణంగా కొట్టారు. ఒకరు పట్టుకుంటుంటే.. మరొకరు కొడుతూ వీడియోలో కనిపించారు.
వీడియో..
This teenager is beaten only to go for #COVID19 testing in #Bangalore ,Boy saying he has no symptoms of infection but officials compelling and beating #coronavirus pic.twitter.com/PfZmoiknoD
— Ashraf Wani اشرف وانی (@ashraf_wani) May 24, 2021
Also Read: