చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం..వెజిటేరియన్‌ మటన్‌..! ఇదో అరుదైన కూరగాయ

మటన్-చికెన్ తినని శాఖాహారులకు ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. మాంసం రుచిని కలిగి ఉండే ఈ ప్రత్యేకమైన కూరగాయ ఇప్పుడు వెజ్ మటన్ గా ప్రసిద్ధి చెందింది. ఈ అరుదైన కూరగాయలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ కూరగాయ శాఖాహారులకు నాన్-వెజ్ లాంటిది.. దీన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దీని వంటకాలను దాదాపు అందరూ ఇష్టపడతారు. ఈ అరుదైన కూరగాయ ఏంటి..? దాని ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం..వెజిటేరియన్‌ మటన్‌..! ఇదో అరుదైన కూరగాయ
Vegetarian Mutton

Updated on: Jan 21, 2026 | 10:52 AM

మనలో నాన్‌వెజ్‌ ప్రియులు చాలా మంది ఉంటారు. అలాగే, వెజిటేరియన్స్‌ కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కొంతమంది మటన్, చికెన్ గురించి చెప్పగానే టక్కున పక్కకు జరిగిపోతుంటారు. అలాంటివారు ఆరోగ్య, మతపరమైన లేదా వ్యక్తిగత కారణాల వల్ల పూర్తి శాఖాహార ఆహారాన్ని అనుసరిస్తారు. అలాంటి శాఖాహారులకు నాన్-వెజ్రు రుచి అనుభవాన్ని అందించే ఒక ప్రత్యేక కూరగాయ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ అరుదైన కూరగాయ జార్ఖండ్‌లోని ఘంగార్డ్ అటవీ ప్రాంతంలో కనిపించే రుగ్డా అనే పుట్టగొడుగు. స్థానికులు దీనిని వెజిటేరియన్ మటన్ అని పిలుస్తారు. ఎందుకంటే దీని రుచి మటన్‌ను పోలి ఉంటుంది. ఇది మాంసంలా రుచిగా ఉన్నప్పటికీ, ఇది పూర్తిగా శాఖాహార ఆహారం.

రుగ్డా.. పుట్టగొడుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా, అధిక కేలరీల కంటెంట్ కారణంగా దీనిని శక్తిని పెంచే ఆహారంగా పరిగణిస్తారు. రుచితో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఈ పుట్టగొడుగు చిన్న బంగాళాదుంపలా కనిపిస్తుంది. సాధారణంగా భూగర్భంలో పెరిగే ఈ ఫంగస్ వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తుంది.

సాధారణంగా ఇది మూడు నుండి నాలుగు రోజుల్లో చెడిపోతుంది. కానీ, ఇప్పుడు దీనిని దాదాపు మూడు నెలల పాటు నిల్వ చేయడానికి వీలు కల్పించే కొత్త సాంకేతికత అభివృద్ధి చేయబడింది. దీనివల్ల రుగ్డా వాణిజ్య విలువ కూడా పెరిగింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా జార్ఖండ్‌లో దొరికే ఈ అరుదైన పుట్టగొడుగుకు పేటెంట్ పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘వెజిటబుల్ మటన్’ అనే పేరుకు ప్రసిద్ధి చెందిన రుగ్డా పుట్టగొడుగుతో తయారు చేసిన వంటకాలను ప్రజలు కూడా ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..