Watch: డిజిటల్‌ బిచ్చగాడు.. చేతిలో క్యూఆర్‌ కోడ్‌తో భిక్షాటన.. వీడియో చూస్తే అవాక్కే..!

|

Jul 04, 2023 | 10:02 AM

సాధారణంగా ఒక బిచ్చగాడు వచ్చి దానం చేయమని అడిగితే.. కొందరు చిల్లర ఉంటే వేస్తారు. మరికొందరు తినేందుకు ఏదైనా ఉంటే ఇస్తారు.. ఇంకొందరు చిల్లర లేదని తిప్పి పంపించేస్తుంటారు. ఇది డిజిటల్ యుగం కాబట్టి నగదు లేదనే చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ బిచ్చగాడు తన దూరదృష్టిని ఉపయోగించి చేతిలో క్యూఆర్ కోడ్‌తో అడుక్కుంటున్నాడు.

Watch: డిజిటల్‌ బిచ్చగాడు.. చేతిలో క్యూఆర్‌ కోడ్‌తో భిక్షాటన.. వీడియో చూస్తే అవాక్కే..!
Beggar Viral Video
Follow us on

మనం ప్రతిరోజు కూడలిలో లేదా రైలులో బిచ్చగాళ్లను చూస్తుంటాం. అక్కడ చాలా సార్లు బిచ్చగాళ్ళు రకరకాలుగా అడుక్కోవడం చూస్తుంటాం. సాధారణంగా రైళ్లలోని సాధారణ కోచ్‌లలో యాచకులు పాటలు పాడుతూ అడుక్కుంటూ ఉంటారు. ఇకపోతే, బిచ్చగాళ్లు చేతిలో ఒక ప్లేట్ లాంటిదో లేదంటే మరేదైనా పాత్ర పట్టుకుని అడుక్కుంటూ ఉంటారు. అయితే ఇది డిజిటల్ యుగం. అందుకే బిచ్చగాళ్లు కూడా అప్‌డేట్‌ అయ్యారు. బిచ్చం అడుకునే స్టైల్‌ కూడా మార్చేశారు. బిచ్చం అడుక్కోవటం కూడా కాలానికి అనుగుణంగా పూర్తిగా నవీకరించబడింది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక బిచ్చగాడు విభిన్నంగా అడుక్కుంటూ కనిపించాడు.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక బిచ్చగాడు తన చేతిలో క్యూఆర్ కోడ్‌తో ప్రజలను వేడుకుంటున్నాడు. రైలులో ఉన్న ఓ వ్యక్తి తన భిక్షాటన తీరును రికార్డు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సర్వత్రా వైరల్‌గా మారింది. సాధారణంగా ఒక బిచ్చగాడు వచ్చి దానం చేయమని అడిగితే.. కొందరు చిల్లర ఉంటే వేస్తారు. మరికొందరు తినేందుకు ఏదైనా ఉంటే ఇస్తారు.. ఇంకొందరు చిల్లర లేదని తిప్పి పంపించేస్తుంటారు. ఇది డిజిటల్ యుగం కాబట్టి నగదు లేదనే చెప్పాల్సి వస్తుంది. అయితే ఈ బిచ్చగాడు తన దూరదృష్టిని ఉపయోగించి చేతిలో క్యూఆర్ కోడ్‌తో అడుక్కుంటున్నాడు. లోకల్ రైలులో భారీ జనసందోహం మధ్య ఓ వ్యక్తి చేతిలో క్యూఆర్ కోడ్‌తో పాట పాడుతూ అడుక్కుంటున్న దృశ్యం వైరల్ అవుతోంది. అక్కడ నిలబడి ఉన్న ప్రయాణికులు బిచ్చగాడిని చూసి ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టారు. కొందరు నవ్వుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

క్యూఆర్ కోడ్‌లు పట్టుకుని రోడ్డు పక్కన బిచ్చగాళ్లు నిలబడిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ముంబైలో చిత్రీకరించినట్లు సమాచారం. అక్కడ ఒక బిచ్చగాడు పాట పాడుతూ భిక్షాటన చేయడాన్ని చూడవచ్చు. ముంబై స్థానికులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..