ముగ్గు ఇంటికి అందం. మన సంప్రదాయంలో ఇంటి ముందు ముగ్గు పెట్టడం ఆనవాయితీ. చిన్నదో.. పెద్దదో ముగ్గు వేయడం వలన ఇంటికి శుభ సూచికం అంటారు. అందమైన ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామని నమ్ముతారు. ఒకప్పుడు తెల్లవారకముందే వాకిట్లో కల్లాపి చల్లి ముగ్గు పిండితో చుక్కుల ముగ్గులు వేసేవారు. దాదాపు మన దేశంలో ఉన్న అమ్మాయిలందరికీ ముగ్గులు పెట్టడం వచ్చే ఉంటుంది. ఇక ఇటీవల ముగ్గులు వేయడం కూడా అబ్బాయిలకు తెలిసిపోయి ఉంటుంది. చాలా మంది క్షణాల్లో ఎంతో అందమైన ముగ్గులను వేస్తారు. బాగా చేయి తిరిగిన వారైతే నిమిషాల్లోనే పెద్ద పెద్ద అందమైన ముగ్గులు వేసేస్తారు.
చుక్క చుక్కను కలుపుతూ వేసే ముగ్గుల చుక్కల మధ్యలో గీతలు గీస్తూ వేసే ముగ్గులు.. సీతాకోక చిలుకలు, తామర పువ్వులు, పక్షులు, జంతువులు, చెట్లు ఇలా ఒక్కటేమిటీ ప్రపంచంలోని ప్రతి జీవరాశి చిత్రాన్ని రంగవల్లులతో వాకిట్లోకి తీసుకోస్తారు. అయితే ముగ్గు వేయడంలో చేయి తిరిగిన వారు అర నిమిషంలో వేస్తారు. మరీ రాని వారి సంగతేంటీ? ఇప్పుడు కాలం మారింది. యూట్యూబ్, ఇంటర్నెట్ లో చూస్తూ క్షణాల్లో ముగ్గులు వేయడం నేర్చుకుంటున్నారు. ఇప్పటికే ముగ్గులు ఏలా వేయాలి ?. ఎలాంటి రంగులు వేయాలి ? అనే వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కానీ మీకు తెలుసా ?… అర నిమిషంలో అందమైన ముగ్గు వేయ్యోచ్చు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ట్రై చేయకుండా ఉండరు. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. మూడు చుక్కలు మధ్య రెండు చుక్కలతో 30 సెకన్లలోనే అందమైన చూడచక్కటి ముగ్గు వేసింది ఓ మహిళ. సూపర్, అద్భుతం అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరీ మీరు కూడా ట్రై చేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.