Hummingbird: రంగులు మారుస్తూ నెటిజన్లను మెస్మరైజ్‌ చేస్తున్న అరుదైన పక్షి.. దాని ధర రూ.28.8లక్షలు.. వైరలవుతున్న వీడియో

|

Aug 15, 2022 | 2:06 PM

ఈ పక్షి ప్రతి సెకనుకు తన రంగును మార్చగలదు.. కాబట్టి దీనిని 'రంగులు మార్చే పక్షి' అని కూడా పిలుస్తారు. ఈ పక్షి ఎర్రటి తలతో ఉన్న ఏకైక ఉత్తర అమెరికా హమ్మింగ్‌బర్డ్.

Hummingbird: రంగులు మారుస్తూ నెటిజన్లను మెస్మరైజ్‌ చేస్తున్న అరుదైన పక్షి.. దాని ధర రూ.28.8లక్షలు.. వైరలవుతున్న వీడియో
Hummingbird
Follow us on

Beautiful Hummingbird: హమ్మింగ్ బర్డ్స్ అతి మనోహరమైన, అందమైన చిన్న పక్షులు. సురకావ్‌గా పిలువబడే.. హమ్మింగ్‌ బర్డ్‌ అందమైన రంగులను చూపించే వీడియో వైరల్ అవుతోంది. సురకావ్ హమ్మింగ్ బర్డ్స్ కుటుంబానికి చెందినది. ఈ పక్షి ప్రతి సెకనుకు తన రంగును మార్చగలదు.. కాబట్టి దీనిని ‘రంగులు మార్చే పక్షి’ అని కూడా పిలుస్తారు. ఈ పక్షి ఎర్రటి తలతో ఉన్న ఏకైక ఉత్తర అమెరికా హమ్మింగ్‌బర్డ్.

చెట్టు కొమ్మపై చిన్న సురకావ్ పక్షి కూర్చున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పక్షి నారింజ-ఊదా రంగులో మెడను వంకరపెట్టి కూర్చుని ఉంది. అది దానికున్న ఊదారంగు రెక్కలను విప్పడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో యుఎస్‌లోని కాలిఫోర్నియాలో కనిపించినట్లు తెలిసింది. హమ్మింగ్‌బర్డ్ శరీరంపై నారింజ, ఆకుపచ్చ, తెలుపు రంగులు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి రంగులు మారనప్పటికీ, పక్షి శరీరం దాదాపు ఇంద్రధనస్సు వలె చాలా రంగురంగులగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘hawk_force’ అనే యూజర్ షేర్ చేశారు. ఇది 61.4 మిలియన్లకు పైగా వ్యూస్, 2.3 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించింది. పక్షి కదులుతున్నప్పుడు వివిధ కోణాల్లో చూసినప్పుడు దాని రంగు వైవిధ్యం కనిపిస్తుంది. మెరుస్తూ..సన్నగా ఉండే పక్షి ఈకల పైన ఉండే కారటిన్ పొరల కారణంగా హమ్మింగ్‌బర్డ్ ఈకల రంగు మారుతుంది. ఉత్తర అమెరికాలో సురాకావ్ ధర $37,000 అని నమ్ముతారు, ఇది భారతదేశంలో దాదాపు రూ. 28.8 లక్షలు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి