ముఖకవళికలతో ఎలుగుబంట్లు ఏం చేస్తాయో తెలుసా?

| Edited By:

Mar 27, 2019 | 7:39 PM

మనుషులకు, పలు జంతువులకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. మనిషి కూడా ఒక సామాజిక జంతువే అన్న కోణంలో మనుషుల్లాగానే జంతువులు ప్రవర్తించే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కోతులు, చింపాంజీలు, కుక్కలు.. ఇలా కొన్ని జంతువులు చాలా విషయాల్లో మనుషుల్లానే అనుకరిస్తాయి. ఇక ఎలుగుబంట్ల విషయానికొస్తే ఆసియా ఖండంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉండే ఎలుగుబంట్లు విభిన్నంగా ఉంటాయి. వీటి ఆకారం కూడా విభిన్నంగా ఉంటుంది. ఇవి అచ్చం మనుషుల్లానే ముఖకవళికల ద్వారా ఇతర ఎలుగుబంట్లతో సంభాషిస్తాయి. […]

ముఖకవళికలతో ఎలుగుబంట్లు ఏం చేస్తాయో తెలుసా?
Follow us on

మనుషులకు, పలు జంతువులకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. మనిషి కూడా ఒక సామాజిక జంతువే అన్న కోణంలో మనుషుల్లాగానే జంతువులు ప్రవర్తించే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

కోతులు, చింపాంజీలు, కుక్కలు.. ఇలా కొన్ని జంతువులు చాలా విషయాల్లో మనుషుల్లానే అనుకరిస్తాయి. ఇక ఎలుగుబంట్ల విషయానికొస్తే ఆసియా ఖండంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉండే ఎలుగుబంట్లు విభిన్నంగా ఉంటాయి. వీటి ఆకారం కూడా విభిన్నంగా ఉంటుంది. ఇవి అచ్చం మనుషుల్లానే ముఖకవళికల ద్వారా ఇతర ఎలుగుబంట్లతో సంభాషిస్తాయి. ఇలాంటి అనుకరణతోనే అవి మాట్లాడుకుంటాయి, అనుంబంధాలను బలపరుచుకుంటాయి. సుఖదుఃఖాలను పంచుకుంటాయి. ఎంతలా అంటే మనం కోతులు, గొరిల్లాలలో మాత్రమే అంత గొప్ప అనుకరణను గుర్తించగలం.

యూకెలోని యూనివర్శిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్‌కు చెందిన పరిశోధకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి చెందిన ఈ ప్రత్యేకమైన 21 ఎలుగుబంట్లపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనతో ఈ విశేషమైన ముఖకవళికల అనుకరణ అంశాన్ని గుర్తించారు. ఎదుటి ఎలుగుబంటిని గమనించిన ఒక్క సెకండ్‌లోనే అచ్చుగుద్దినట్టు అనుకరించగలవు. మనుషలతో కోతుల మాదిరిగా ఈ ధృవపు ఎలుగుబంట్లకు అత్యంత దగ్గర సంబంధం లేకపోయినప్పటికీ ఆశ్చర్యకరంగా అనుకరిస్తున్నాయి. అయితే ఇది ఇతర పలు క్షీరదాల్లో కూడా ఉండి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కుక్కలు కూడా బంధాలను బలపరుచుకునేందుకు తోటి కుక్కలను అనుకరిస్తుంటాయి. అయితే ఈ ఆగ్నేయ ఆసియాలో ఉండే ఎలుగుబంట్లు మాత్రం ముఖ కవళికల ద్వారానే ఎక్కువగా కమ్యునికేట్ చేస్తుంటాయి.