Watch Video: హాయిగా రిలాక్స్ అవుతుంటే ఒక్కసారిగా ఎదురుపడిన ఎలుగుబంటి..తర్వాత ఏం జరిగిందంటే

|

Apr 19, 2023 | 10:57 AM

సోషల్ మీడియాలో ఎదైన వింతగా వీడియో కనిపిస్తే చాలు వెంటనే వైరల్ అయిపోతుంది. తాజాగా ఓ మనిషికి ఎలుగు బంటి ఎదురుపడిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని డేవిడ్ ఆప్పిన్‌హీమర్ అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో ఓ పెద్ద కూర్చి వేసుకుని మొబైల్ ఫోన్ వాడుతూ హాయిగా రిలాక్స్ అవుతుంటాడు.

Watch Video: హాయిగా రిలాక్స్ అవుతుంటే ఒక్కసారిగా ఎదురుపడిన ఎలుగుబంటి..తర్వాత ఏం జరిగిందంటే
Man And Bear
Follow us on

సోషల్ మీడియాలో ఎదైన వింతగా వీడియో కనిపిస్తే చాలు వెంటనే వైరల్ అయిపోతుంది. తాజాగా ఓ మనిషికి ఎలుగు బంటి ఎదురుపడిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని డేవిడ్ ఆప్పిన్‌హీమర్ అనే వ్యక్తి తన ఇంటి పెరట్లో ఓ పెద్ద కుర్చీ వేసుకుని మొబైల్ ఫోన్ వాడుతూ హాయిగా రిలాక్స్ అవుతుంటాడు. అయితే ఇంతలోనే ఓ ఎలుగుబంటి అతనికి దగ్గర్లో నడుచుకుంటూ వస్తుంది. ఆ ఎలుగుబంటిని చూసి డేవిడ్ భయంతో షాక్ అవుతాడు. ఆ ఎలుగుబంటి కూడా అతడ్ని చూసి షాక్ అవుతుంది. కొన్ని క్షణాల పాటు ఇద్దరూ అలా ఒకరినొకరు భయంతోనే చూసుకుంటారు. ఆ తర్వాత ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోతుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటీజన్లు విభిన్న రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నల్ల ఎలుగుబంట్లు చాలా అరుదుగా దాడి చేస్తుంటాయని లక్షలో ఒకరికి మాత్రమే దాడి జరిగే అవకాశం ఉంటుందని ఓ వినియోగ దారుడు కామెంట్ చేశాడు. మరో వినియోగదారుడు వీరిద్దరిలో ఎవరు ఎక్కువగా భయపడ్డారు..ఎలుగు బంటా లేక ఆ వ్యక్తా అంటూ కామెంట్ చేశాడు. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందంటూ మరో యూజర్ తెలిపాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..