E-Cigarette: ఈ సిగరెట్ జేబులో పెట్టుకొని పబ్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే.. తలపట్టుకున్న డాక్టర్స్..
అయితే, ఇ-సిగరెట్‌లు లేదా వేప్‌లు కూడా హానికరమేనిని పలు అధ్యయనాల్లో తేలింది. ఇ-సిగరెట్లు, వేవ్‌లు ఇతర మార్గాల్లో కూడా హాని కలిగిస్తాయని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా.
‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ ఈ కొటేషన్ మనం చాలా చోట్ల చూస్తాం. సినిమా థియేటర్లలో, పెద్ద పెద్ద మాల్స్‌లో బోర్డులు పెడతారు..అంతేకాదు సిగరెట్ ప్యాకెట్లపైన కూడా సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని ముద్రిస్తారు. ఈ హెచ్చరికలను కేవలం కొటేషన్లుగా మాత్రమే తీసుకుంటారు ధూమపాన ప్రియులు. వాటిని ఏమాత్రం పట్టించుకోరు. ఆనక అనారోగ్యం బారిన పడిన పడతారు. కొందరు సాధారణ సిగరెట్లకు బదులుగా హానికరం కాదని భావించి ఇ-సిగరెట్లు, వేప్‌లకు అలవాటుపడతారు. అయితే, ఇ-సిగరెట్‌లు లేదా వేప్‌లు కూడా హానికరమేనిని పలు అధ్యయనాల్లో తేలింది. ఇ-సిగరెట్లు, వేవ్‌లు ఇతర మార్గాల్లో కూడా హాని కలిగిస్తాయని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా.
స్కాట్లాండ్‌లోని ఒక బిజీ పబ్‌కు అయిర్‌షైర్‌కు చెందిన ఓ వ్యక్తి వేప్‌ను జేబులో పెట్టుకుని పబ్‌కి వెళ్లాడు. అతడు పబ్‌లో ఎంజాయ్ చేస్తుండగా జేబులో ఉన్న వేప్ ఒక్కసారిగా పేలింది. దాంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అక్కడి సిబ్బంది ఆ యువకుడిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు . అతడి గాయాలకు చికిత్స చేసేందుకు వైద్యులు పక్క తొడ నుంచి చర్మాన్ని స్కిన్ గ్రాఫ్ట్‌గా ఉపయోగించాల్సి వచ్చింది. అతని మధ్య వేలు తప్ప మిగతా వేళ్లు, అరచేతిలో బొబ్బలు వచ్చాయి. అనంతరం అతడిని ఆ హాస్పిటల్ నుంచి గ్లాస్గో రాయల్ ఇన్‌ఫర్మరీలోని స్పెషలిస్ట్ బర్న్ యూనిట్‌కి మార్చారు. ఆ గాయాలు చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. వేప్ పేలడం ద్వారా ఇంతగా గాయపడిని వారిని తామింతవరకూ చూడలేదన్నారు. బ్యాటరీ పేలడం వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని గాయపడిన వ్యక్తి తెలిపాడు. పేలిన వేవ్‌ను సెప్టెంబర్ 2020లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్టు చెప్పాడు.