Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో మొదటగా మీరేం చూస్తారో.. అదే ఫ్రెండ్స్ పట్ల మీరెలా ఉంటారో చెప్పేస్తుంది!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సరదాగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు అవి మనలోని వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తాయి.

Viral Photo: ఈ ఫోటోలో మొదటగా మీరేం చూస్తారో.. అదే ఫ్రెండ్స్ పట్ల మీరెలా ఉంటారో చెప్పేస్తుంది!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 30, 2022 | 5:44 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు సరదాగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు అవి మనలోని వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తాయి. ప్రస్తుతం ఆ కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని మీకు చూపించబోతున్నాం. ఈ ఫోటో మీరు ఎలాంటి స్నేహితుడో చెప్పేస్తుంది. మరి లేట్ ఎందుకు కొన్ని సెకన్ల టైం వెచ్చించండి.. దీనిపై ఓ లుక్కేయండి.

మనలోని ప్రతీ ఒక్కరూ మొదటిగా విభిన్న విషయాలను చూస్తాం. పైనున్న ఫోటోలో కూడా మీరేం చూశారు.! డ్రాగన్‌ని చూశారా? లేదా టోపీ ధరించిన వ్యక్తిని చూశారా? లేదా సైనికుడిని చూశారా.? మీరేం మొదటిగా చూసినా..? అది మీ స్నేహాన్ని తెలియజేస్తుంది. మరి ట్రై చేయండి.

మీరు మొదట డ్రాగన్‌ని గుర్తించినట్లయితే..

విధేయత మీ బలమైన అంశం. మీ స్నేహితులను ఎల్లప్పుడూ రక్షించడానికి సర్వశక్తులు ఒడ్డిస్తారు. వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అయినప్పటికీ, సహనం కోల్పోవడం, స్వల్ప-స్వభావిత ప్రవర్తన తరచూ మీ స్నేహ బంధంలో సమస్యలు తెచ్చిపెడతాయి.

మీరు మొదట టోపీ ధరించిన వ్యక్తిని గుర్తించినట్లయితే..

మీరెప్పుడూ ఫన్నీ మూడ్‌లో ఉంటారు. ఒత్తిడిలో ఉన్న ఫ్రెండ్‌ను సైతం మీరు కూల్ చేసేస్తారు. మీ స్నేహితులకు మీలోని ఈ గుణమే నచ్చుతుంది. వాళ్లు డిప్రెషన్‌గా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉండాలని ప్రయత్నిస్తుంటారు. మీ హాస్యం కూడా ఎప్పుడూ అతిగా ఉండదు.

మీరు మొదట సైనికుడిని గుర్తించినట్లయితే..

మీరు నమ్మకమైన, ఓదార్పునిచ్చే స్నేహితుడు. మీ స్నేహితులు మంచి మాటల కోసం మీ వద్దకు వస్తారు. వారిని ఓదార్చడానికి మీరు ఎల్లప్పుడూ ముందుంటారు. ఎప్పుడూ కూల్‌గా, హేతుబద్ధంగా వ్యవహరిస్తారు. మీ స్నేహితులు మీ స్నేహానికి విలువనిస్తారు.