ఒక్కసారిగా కూలిపోయిన రోడ్డు.. 50 మీటర్ల లోతైన భారీ గుంత!

బ్యాంకాక్‌లోని వజీరా ఆసుపత్రి సమీపంలో రోడ్డు కూలిపోవడంతో 50 మీటర్ల లోతు గుంత ఏర్పడింది. మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. భూగర్భ మెట్రో నిర్మాణం ఈ ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. రోడ్డు క్రమంగా కుంగిపోవడం, విద్యుత్ స్తంభాలు, నీటి పైపులు దెబ్బతినడం వీడియోల్లో కనిపించాయి.

ఒక్కసారిగా కూలిపోయిన రోడ్డు.. 50 మీటర్ల లోతైన భారీ గుంత!
Bangkok Sinkhole

Updated on: Sep 24, 2025 | 8:57 PM

థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో రోడ్డు కూలిపోవడంతో 50 మీటర్ల లోతున భారీ గుంట పడింది. వెంటనే స్థానికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. ఈ సంఘటన తర్వాత దెబ్బతిన్న రోడ్డుపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్యాంకాక్ గవర్నర్ చాడ్‌చార్ట్ సిట్టిపుంట్ మాట్లాడుతూ.. రోడ్డు కూలిపోవడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, కానీ మూడు వాహనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. భారీ సింక్‌హోల్‌లో ఒక కారు పడిపోగా, మరొక కారు అంచున చిక్కుకుపోయింది. వజీరా హాస్పిటల్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

భూగర్భ మెట్రో స్టేషన్ నిర్మాణంలో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. స్టేషన్ పైకప్పు దెబ్బతిన్నప్పుడు, దాని పైన ఉన్న మట్టి సొరంగంలోకి, నిర్మాణంలో ఉన్న భూగర్భ స్థలంలోకి ప్రవహించింది, దీని వలన సమీపంలోని భవనాలు కూలిపోయాయి. సంఘి వంతెన వైపు వెళ్లే వైపు స్థిరంగా ఉంది, కానీ కూలిపోయిన వైపు మృదువైన నేల ఉంది, సహాయక నిర్మాణాలు లేవు అని సిట్టిపుంట్ నేషన్ థాయిలాండ్‌తో చెప్పినట్లు ఉటంకించబడింది. రోడ్డు ఉపరితలం క్రమంగా కుంగిపోవడం, అనేక విద్యుత్ స్తంభాలను కిందకు లాగడం, నీటి పైపులు విరిగిపోవడం వీడియోలలో కనిపిస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి