
ఒకవైపు ప్రసవ వేదన అనుభవిస్తున్న మహిళలను ప్రసవానికి తీసుకెళ్లడానికి వైద్య సిబ్బంది పరుగులు తీస్తున్నారు. మరోవైపు చంద్రగ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే డెలివరీ అంటూ గర్భిణీ మహిళలు వేడుకుంటున్నారు. నొప్పి వచ్చిన వెంటనే ప్రసవం చేయకపోతే తల్లి , బిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు మహిళలను ఒప్పించడానికి ప్రయత్నించారు. ఇలాంటి వింత ఘటన బళ్లారి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్నట్లు సమాచారం.
చంద్రగ్రహణం సమయంలో చాలా మంది గర్భిణీ స్త్రీలు ప్రసవానికి నిరాకరించారు. తీవ్రమైన ప్రసవ నొప్పులు వస్తున్నా.. మహిళలు ఆపరేషన్ గదిలోకి ప్రవేశించడానికి నిరాకరించారు. గ్రహణం ముగిసే వరకు తమ ప్రసవాన్ని వాయిదా వేయాలని కూడా వారు డిమాండ్ చేశారని ఆసుపత్రి వర్గాలు చెప్పిన విషయాన్నీ ఉటంకిస్తూ ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
వైద్యులు ఎంత చెప్పినా గర్భిణీ స్త్రీలు ప్రసవించడానికి నిరాకరించారు. చంద్రగ్రహణం సమయంలో ప్రసవం అయితే నవజాత శిశువు, తల్లికి ఇద్దరికీ ప్రమాదం ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. తరువాత, ఇద్దరు గర్భిణీ స్త్రీలలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం ప్రారంభమైంది. పరిస్థితి మరింత దిగజారింది. దీనితో ఆసుపత్రి అధికారులు అత్యవసర చర్యలు తీసుకోవలసి వచ్చింది. సీనియర్ వైద్యులు వార్డుకు చేరుకుని.. డెలివరీ అవ్వకపోతే గర్భిణీ స్త్రీకి జరిగే ప్రమాదం గురించి వారి కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించగలిగారని నివేదిక పేర్కొంది.
స్త్రీలలో ఉన్న కొన్ని మూఢ నమ్మకాల కారణంగా.. ప్రసవ వేదన అనుభవిస్తున్న వారు కూడా ప్రసవాన్ని వాయిదా వేయమని వేడుకుంటున్నారు. అటువంటి మూఢ నమ్మకాలు, ఆలోచనలను విస్మరించడం చాలా అవసరం అని బళ్లారి జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ రమేష్ బాబు చెప్పారు. అదృష్టవశాత్తూ బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు స్త్రీలను ప్రసవానికి ఒప్పించగలిగారు.. కనుక పెద్ద విపత్తు నివారించబడింది.
స్త్రీలు ప్రసవ నొప్పులు లేదా గర్భధారణకు సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పుడల్లా.. శుభ లేదా అశుభ సమయాల గురించిన మూఢనమ్మకాలతో సంబంధం లేకుండా వారు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆదివారం జరిగిన చివరి చంద్రగ్రహణం సమయంలో తమ వైద్య సిబ్బంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు.. అయితే వైద్యులు తమ పని చేయడంలో సక్సెస్ అయ్యారు. అనేక ప్రసవాలను చేసినట్లు రమేష్ బాబు చెప్పినట్లు నివేదిక పేర్కొంది
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..