Viral Video: ఇటీవల గత కొద్ది రోజులుగా అడవిలో ఉండాల్సిన ఏనుగులు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. పంటలు, ఇళ్లు.. ఇలా కనిపించిన వాటిని నాశనం చేస్తున్నాయి. దీంతో గ్రామాల్లో ఉండే ప్రజలు భయంతో కాలాన్ని వెల్లదీస్తున్నారు. అడవులు తగ్గిపోవడంతో… వన్యప్రాణులు మొత్తం ఊర్లపై దాడి చేస్తున్నాయి. కోతులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, పులులు ఇలా ఒక్కటేమిటి అడవి జంతువులన్ని దారి తప్పి ఊర్లలోకి వచ్చేస్తున్నాయి. అయితే కొన్ని సార్లు అవి వచ్చి ఎటు వెళ్లలేని పరిస్థితులలో పడిపోతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం నీటిలో పడిన గున్న ఏనుగును అటవి శాఖ అధికారులు గంటల తరబడి ప్రయత్నించి రక్షించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి వీడియోనే మరోకటి నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది.
ఆ వీడియోలో.. ఓ గున్న ఏనుగును ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయింది. దీంతో విషయం తెలుసుకున్న అటవి శాఖ అధికారులు దానిని రక్షించేందుకు అక్కడకు వచ్చారు. కర్రలు, తాడుల సహాయంతో అటవి శాఖ అధికారులు ఆ ఏనుగును రక్షించారు. గుంత నుంచి బయటకు రాగానే వెంటనే అది తమ స్నేహితుల వద్దకు పరుగు తీసింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ కస్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు. కిడో గ్రామానికి నీరు సరఫరా చేస్తున్న జలాశంలో ఈ ఏనుగు పడింది. అటవి శాఖ అధికారులు, వైల్డ్ లైఫ్ స్క్వాడ్ 2, వెట్ బృందం సమయానికి చేరుకొని దానిని రక్షించారు. ఆ ఏనుగు సంతోషంతో మళ్లీ తన కుటుంబంతో చేరింది అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటివరకు ఈ వీడియోను 67,000 మంది వీక్షించగా.. నెటిజన్లు రకారకాలుగా స్పందిస్తున్నారు.
ట్వీట్..
Kiddo fell into reservoir from where water was being supplied to village. Territorial team, wildlife squad II & vet team reached on time. Was rescued & happily united with family. Mother was watching from safe. Our team. pic.twitter.com/NqSnhH94Rs
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 23, 2021
ఆర్ యూ వర్జిన్ ? అంటూ ప్రశ్నించిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సురేఖా వాణి కూతురు..