Viral Video: అచ్చం చిన్న పిల్లోడిలానే జలకాలాడిన గజరాజు.. క్యూట్ వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..

Baby Elephant Enjoy Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం

Viral Video: అచ్చం చిన్న పిల్లోడిలానే జలకాలాడిన గజరాజు.. క్యూట్ వీడియో చూస్తే మైమరిచిపోవాల్సిందే..
Elephant

Updated on: Nov 02, 2021 | 9:52 PM

Baby Elephant Enjoy Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇలాంటి వీడియోలను నెటిజన్లు పదేపదే చూస్తూ.. ఆనందిస్తుంటారు. వైరల్ అవుతున్న వీడియోల్లో జంతువులకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఓ చిన్న ఏనుగుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ క్యూట్ వీడియోను చూసి.. చాలా మంది నెటిజన్లు ముద్దుముద్దుగా కామెంట్లు పెడుతున్నారు. అచ్చం మానవుల్లాగే.. ఓ చిన్న గాజరాజు నీటిలో ఎంజాయ్ చేస్తోంది. ఆస్వాదిస్తూ మరి.. స్నానం చేస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా పలు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. పెద్ద ఏనుగు పక్కనుండగా.. చిన్న ఏనుగు స్నానం చేస్తుంటుంది. చిన్న గుంతలో అది ఆనందిస్తూ స్నానం చేయడాన్ని మీరు కూడా చూడవచ్చు. ఈ పిల్ల ఏనుగు సంతోషం కోసం ఇక్కడికి తీసుకొచ్చినట్లు పెద్ద ఏనుగు కూడా.. పక్కనుండి మరి దాన్ని ప్రోత్సాహం అందించేలా నిలబడి ఉంటుంది. ఈ క్రమంలో గున్న ఏనుగు నీళ్లలో కాళ్లూ ఊపుతూ.. ఎంజాయ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో చిన్న గజరాజు సంతోషంతో.. నీటిలో స్నానం చేస్తుంటే.. పెద్ద ఏనుగు తన తొండాన్ని కదుపుతూ.. ఆనందిస్తోంది.

వైరల్ వీడియో.. 

Also Read:

Viral Video: ప్రాణం తీసిన గుంత.. ఆఫీస్‌కు వెళ్తుండగా.. బస్సు కిందపడి బైకర్‌ దుర్మరణం.. వీడియో

Viral Video: కిచెన్ నుంచి వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా షాక్.. వైరల్ వీడియో.!