Viral Video: కిచెన్ నుంచి వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా షాక్.. వైరల్ వీడియో.!

అప్పుడప్పుడూ కుక్కలు, పిల్లులు ఇంట్లోకి చొరబడి ఆహారాన్ని తినటం.. సామాన్లను చిందర వందరగా పడేయటం వంటివి...

Viral Video: కిచెన్ నుంచి వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా షాక్.. వైరల్ వీడియో.!
Bear
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 06, 2021 | 1:32 PM

అప్పుడప్పుడూ కుక్కలు, పిల్లులు ఇంట్లోకి చొరబడి ఆహారాన్ని తినటం.. సామాన్లను చిందర వందరగా పడేయటం వంటివి మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే మీరెప్పుడైనా ఓ ఎలుగుబంటి అనుకోని అతిధిలా ఇంట్లోకి దూరి కెఎఫ్‌సి చికెన్‌ లాగించడం చూశారా.? ఏంటి ఎలుగుబంటి చికెన్ తిన్నదా అని ఆశ్చర్యపోకండి.! తాజాగా కాలిఫోర్నియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు తరచూ ట్రెండ్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని మనసుకు ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియోనే ఇది. దీనిని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఓ ఎలుగుబంటి.. ఓ ఇంట్లోని కిచెన్‌లోకి దూరి చికెన్‌ను పరపరా లాగించేసింది.

వైరల్ వీడియో ప్రకారం.. కాలిఫోర్నియాలోని సియెర్రా మాడ్రేలో నివసిస్తున్నట్లు ఓ వ్యక్తి తన ఇంట్లో నిద్రపోతుండగా వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఆ శబ్దాలు పెద్దగా వస్తుండటంతో ఏంటని అతడు తలుపు తెరిచి వెళ్లి చూడగా.. హాల్ డోర్ ఓపెన్ చేసి ఉండటాన్ని గమనించాడు. అలాగే వింత శబ్దాలు వంట గది నుంచి రావడాన్ని గుర్తించాడు. ఎవరో దొంగలు దూరి ఉంటారనుకుని భయపడుతూ అక్కడికి వెళ్లి చూసి.. ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అక్కడ ఓ ఎలుగుబంటి ఇంచక్కా కెఎఫ్‌సి చికెన్‌ను లాగిస్తోంది. అంతేకాకుండా వంటగది మొత్తం చిందరవందర చేసేసింది. కాగా, చివరికి ఆ ఎలుగుబంటిని అతడు ఎలాగోలా బయటికి పంపించేశాడు. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??