భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన జీవులలో డైనోసర్స్ ఒకటి. ఈ రాక్షస బల్లులు చాలా కాలం క్రితమే అంతరించిపోయాయి. చాలా సంవత్సరాల క్రితం డైనోసర్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. తాజాగా ఓ సముద్ర తీరాన బుల్లి డైనోసర్స్ పరుగులు పెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. ఈ వీడియో చూడటానికి వారికి కొన్ని సెకన్ల సమయం పట్టిందంటూ క్యాప్షన్ ఇచ్చిన ఈ వీడియోను ట్విట్టర్‌లో బ్యూటెంగెబిడెన్ షేర్ చేశారు. 14 సెకన్ల నిడివి ఉన్న ఈ చిన్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
ఆ వీడియోలో బేబీ డైనోసర్లుగా కనిపిస్తున్న జంతువులు.. నిజానికి డైనోసర్స్ కావు.. వాటిలాగే పొడవాటి మెడతో కనిపిస్తున్న డైనోసార్ జాతికి చెందిన సౌరోపాడ్స్. సముద్రం తీరాన నుంచి పరుగులు పెడుతున్న ఆ జంతువులను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి షేర్ చేయగా.. అవి చూడటానికి డైనోసర్ల మాదిరిగా ఉండడంతో నెటిజన్స్ షాకవుతున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో చూసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా బాగుందని.. తనకు కూడా కొన్ని సెకన్ల పాటు సమయం పట్టిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ట్వీట్..
This took me a few seconds.. ? pic.twitter.com/dPpTAUeIZ8
— Buitengebieden (@buitengebieden) May 4, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట.. సినిమా నిడివి ఎంతంటే..
NTR Jr.: ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. సినిమా షూటింగ్ ఎప్పుడంటే..