
జమ్మూ కాశ్మీర్‌లోని సోనామార్గ్ పర్యాటక ప్రదేశంలో బుధవారం భారీ హిమపాతం సంభవించింది. ఈ ఉదయం గండేర్బల్‌లోని సోనామార్గ్ సర్బల్ ప్రాంతంలో సంభవించిన హిమపాతం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, హిమపాతం కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం అందలేదు. కాగా, ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హిమపాతం సందర్భంగా అక్కడే ఉన్న పలువురు స్థానికులు వెంటనే అప్రమత్తమై పరుగులు తీసిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
🇮🇳📹 A massive avalanche strikes the Indian village of Sarbal in Jammu and Kashmir. 🥶🥶#Avalanche #India #JammuAndKashmir #Disaster #weather #Kashmir #Jammu #Sarbal #BreakingNews #incredible #Indian #Pakistan pic.twitter.com/bKymfbzrsS
— Ali Shunnaq (@schunnaq) March 5, 2025
ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో మనా గ్రామం వద్ద కూడా భారీ హిమపాతం సంభవించింది. అక్కడ పనులు చేస్తున్న కార్మికుల్లో 55 మంది మంచు కింద చిక్కుకుపోయారు. వారిలో 47 మందిని సురక్షితంగా రక్షించగా, ఎనిమిది మంది మంచుదిబ్బల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..