AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఏందిరయ్య ఇది.. పెళ్లయిన రెండో రోజే వరుడికి షాకిచ్చిన వధువు.. మామూలు యవ్వారం కాదుగా..

కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వరుడికి పెళ్లయిన రెండో రోజే ఊహించని షాకిచ్చింది వధువు. దాంతో తాను మోసపోయానని లబోదిబోమంటున్నాడు నవవరుడు.. అత్తాగారింట అడుగుపెట్టిన రెండో రోజే వధువు బిడ్డకు జన్మనిచ్చింది.. నవ వధువు బిడ్డకు జన్మనివ్వడంతో వరుడు కుటుంబం దెబ్బకు షాకయ్యింది..

Viral: ఏందిరయ్య ఇది.. పెళ్లయిన రెండో రోజే వరుడికి షాకిచ్చిన వధువు.. మామూలు యవ్వారం కాదుగా..
Weddeng
Shaik Madar Saheb
|

Updated on: Mar 06, 2025 | 11:37 AM

Share

కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వరుడికి పెళ్లయిన రెండో రోజే ఊహించని షాకిచ్చింది వధువు. దాంతో తాను మోసపోయానని లబోదిబోమంటున్నాడు నవవరుడు.. అత్తాగారింట అడుగుపెట్టిన రెండో రోజే వధువు బిడ్డకు జన్మనిచ్చింది.. నవ వధువు బిడ్డకు జన్మనివ్వడంతో వరుడు కుటుంబం దెబ్బకు షాకయ్యింది.. కాళ్ల పారాణి ఆరకమునుపే ఒక బిడ్డకు జన్మనివ్వడం వరుడి కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది.

ఫిబ్రవరి 24వ తేదీన ఓ జంటకు ఎంతో వేడుకగా వివాహం జరిగింది. మరుసటి రోజే నవ వధువు అత్తారింట అడుగు పెట్టింది. ఫిబ్రవరి 26న ఉదయం వరుడి కుటుంబ సభ్యులందరికీ నవ వధువు టీ కూడా కాచి ఇచ్చింది. ఆ రోజు సాయంత్రమే ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటే వరుడు, అతని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ యువతికి పురిటినొప్పులు వచ్చాయని, బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యుడు చెప్పడంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

డెలివరీ చేసిన వైద్య సిబ్బంది బిడ్డను తీసుకొచ్చి వారి చేతిలో పెట్టారు. దీంతో ఖంగుతిన్న నవ వరుడు తాము మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమెను భార్యగా స్వీకరించేందుకు నిరాకరించాడు. ఈ విషయంపై వరుడి సోదరి స్పందిస్తూ.. పెళ్లి సమయంలో వధువు పెద్ద లెహంగా ధరించిందని, దీంతో ఆమె గర్భవతి అన్న అనుమానం రాలేదని చెప్పింది. వధువు విషయంలో తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్