కొత్త నగరాలు, తెలియని ఊర్లలో ఆటోగానీ, టాక్సీగానీ తీసుకోవడానికి ప్రజలు భయపడతారు. ఎందుకంటే డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి కథనాలు సర్వసాధారణం. ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి మోసం ఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ, అందుకు విరుద్ధంగా ఓ ఆటోడ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. తన ఆటోలో ప్రయాణించిన వ్యక్తి పొరపాటున రెండుసార్లు ఆన్‌లైన్ పేమెంట్ చేస్తుండగా డ్రైవర్ అడ్డుకున్నాడు. కాగా, ఈ మేరకు సదరు యువకుడు విషయం సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు.
వైరల్ వీడియోలో ఒక వ్యక్తి బెంగళూరులో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. తాను ఆటో ఛార్జీలు ఇప్పటికే చెల్లించానని, మరచిపోయి మళ్లీ చెల్లించడానికి ప్రయత్నించగా, ఆటో డ్రైవర్ తాను ఇప్పటికే చెల్లించినట్లు గుర్తు చేశాడని వివరించాడు. వారు ప్రయాణిస్తుండగా, దారిలో ఆటో డ్రైవర్ సీఎన్ జీ నింపేందుకు ఆటోను ఆపి డబ్బులు అడిగాడు. యువకుడు డబ్బు ఇచ్చాడు. ఇంటికి రాగానే ఆటో ఆగింది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆటో ఛార్జీ చెల్లించేందుకు యువకుడు ప్రయత్నించాడు. కానీ, ఆటో డ్రైవర్ మాత్రం అప్పటికే డబ్బులు ఇచ్చాడని గుర్తు చేశాడు.
Bengaluru: Auto Driver Reminds Passenger To NOT Pay Him After A Ride; Here’s Why – https://t.co/ch5aXBiTEh
— Curly Tales (@CurlyTalesIndia) December 15, 2024
అయితే, ఇది అంత పెద్ద విషయం కాదని నాకు తెలుసు, కానీ, మనం తరచుగా ఇలాంటి కథలు చాలా చదువుతాము ఈ అనుభవం భిన్నంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి