Viral Video: అర్ధ‌రాత్రి వంట‌గ‌దిలో వింత శ‌బ్ధాలు.. దొంగ అనుకుని వెళ్లి చూస్తే ఫ్యూజులు ఔట్‌..!

|

Mar 21, 2022 | 9:33 AM

పొద్దస్తమానం ఇంటి పనులు చేసి చేసి అలసిపోయిన ఆ ఇల్లాలు రాత్రి నిద్రకు ఉపక్రమించింది. ఘాడమైన నిద్రలో ఉన్న సమయంలో అర్ధ‌రాత్రిపూట వంట‌గ‌దిలోంచి వింత శ‌బ్ధాలు వినిపించాయి.

Viral Video: అర్ధ‌రాత్రి వంట‌గ‌దిలో వింత శ‌బ్ధాలు..  దొంగ అనుకుని వెళ్లి చూస్తే ఫ్యూజులు ఔట్‌..!
Representative image
Follow us on

Trending Video: పొద్దస్తమానం ఇంటి పనులు చేసి చేసి అలసిపోయిన ఆ ఇల్లాలు రాత్రి నిద్రకు ఉపక్రమించింది. ఘాడమైన నిద్రలో ఉన్న సమయంలో అర్ధ‌రాత్రిపూట వంట‌గ‌దిలోంచి వింత శ‌బ్ధాలు వినిపించాయి. దీంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. దొంగలు వచ్చేరేమో అని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది. ముందు ఒకసారి పరిశీలిద్దామని… మెళ్ల‌గా వెళ్లి చూసింది. అంతే అక్కడ దృశ్యం చూసి దెబ్బకు షాక్‌ తింది. వంట‌గ‌దిలో శ‌బ్ధం చేసింది దొంగ కాదు.. ఓ కొండ‌చిలువ‌. దీంతో స్నేక్ క్యాచర్‌కి సమాచారం ఇవ్వగా.. అతడి దాన్ని జాగ్రత్తగా బంధించాడు.  ఈ సంఘ‌ట‌న ఆస్ట్రేలియా(Australia)లోని క్వీన్స్‌ల్యాండ్‌లోగ‌ల గ్లెన‌వ్యూలో జ‌రిగింది. ఈ వీడియోను సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్( Sunshine Coast Snake Catchers) త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. స‌ద‌రు మ‌హిళ కొండ‌చిలువ‌ను చూసిన వెంట‌నే స్నేక్ క్యాచ‌ర్స్‌కు ఫోన్‌ చేసింది. వాళ్లు వ‌చ్చి దాన్ని జాగ్రత్తగా ప‌ట్టుకున్నారు. ఆపై దాన్ని అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ సంఘటన అంతా వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో బాగా వైరల్ అయ్యింది.

అయితే ప్రస్తుతం వేసవి తాపానికి నీరు దొరక్క పాములు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉందని.. వాటిపై దాడులు చేయకుండా అటవీశాఖకు లేదా వన్యప్రాణి విభాగానికి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.

Also Read:  బార్డర్ వద్ద అనుమానాస్పదంగా డ్రైవర్.. ట్రక్ లోపల చెక్ చేసి కంగుతిన్న అధికారులు

అక్కడ కేజీ చికెన్ 1000.. ఒక్కో గుడ్డు 35 రూపాయలు.. కిలో ఉల్లిపాయలు 250