Viral Video: కిచెన్ నుంచి వింత శబ్దాలు.. ఎవరా అని భయపడుతూ వెళ్లి చూడగా మైండ్ బ్లాంక్..

|

May 17, 2022 | 1:53 PM

కిచెన్‌లో నుంచి వింత శబ్దాలు రావడంతో ఓ మహిళ భయపడిపోయింది. అసలు తన ఇంటి కిచెన్‌లో ఏం జరుగుతోందో చూసేందుకు కర్ర తీసుకుని భయపడుతూనే..

Viral Video: కిచెన్ నుంచి వింత శబ్దాలు.. ఎవరా అని భయపడుతూ వెళ్లి చూడగా మైండ్ బ్లాంక్..
Python
Follow us on

ఓ మహిళ తన కిచెన్ నుంచి అర్ధరాత్రి వేళ వింత శబ్దాలు రావడాన్ని గమనించింది. ఇంట్లో ఒంటరిగా ఉంటోన్న ఆమె భయపడుతూనే.. ఎవరో దొంగ దూరి ఉంటాడేమోనని అనుకుంటూ కర్ర తీసుకుని భయం.. భయంగా వంట గదిలోకి ఎంటర్ అయింది.. కిచెన్‌లోకి రాగానే ఆమెకు ఒక్కసారిగా షాక్ అయింది.. ఎక్కడ చూసినా వస్తువులు చిందరవందరగా పడి ఉండటం.. శబ్దాలు ఇంకా గట్టిగా వస్తుండటంతో.. ఆ శబ్దాలు వచ్చే వైపే నెమ్మదిగా భయపడుతూ వెళ్లింది సదరు మహిళ. అక్కడ ఆమెకు షాకింగ్ సీన్ కనిపించింది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ అర్ధరాత్రి తన కిచెన్ నుంచి వింత శబ్దాలు రావడాన్ని గుర్తించింది. అలాగే గ్లాస్ పగిలిన పెద్ద శబ్దం కూడా రావడంతో.. ఎవరో దొంగ తన ఇంట్లోకి దూరి ఉంటాడనే అనుమానంతో పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చేలోపు తన వంటిగదిలో ఏం జరుగుతోందో చూసేందుకు కర్ర తీసుకుని మరీ వెళ్లింది ఆ మహిళ.. ఇక అక్కడికి వెళ్లగానే చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు ఆమెకు దర్శనమిచ్చాయి. అంతేకాకుండా ప్యాంట్రీలోని ఓ అరలో పెద్ద కొండచిలువ కనిపించడంతో సదరు మహిళకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. కాగా, స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్స్‌కు ఆమె సమాచారం అందించడంతో వాళ్లు అక్కడికి చేరుకొని ఆ పైథాన్‌ను చాకచక్యంగా పట్టుకున్నారు. దాన్ని తిరిగి అడవిలో సురక్షితంగా విడిచిపెట్టారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి..

ఇవి కూడా చదవండి