Viral News: స్విగ్గీ డెలివరీ బాయ్​గా మారిన‌ ఆడీ ఆర్​8 కార్​ ఓనర్​.. ప్రాంక్ కాదండోయ్

|

Jun 11, 2021 | 2:56 PM

మ‌నం యూట్యూబ్‌లో ర‌క‌ర‌కాల ప్రాంక్ వీడియోలు చూస్తుంటాం. అప్ప‌టివ‌ర‌కు అడుక్కున్న వ్య‌క్తులు... ఖ‌రీదైన కారుల్లో వెళ్లే వీడియోలు మీ కంట‌ప‌డి ఉంటాయి. అయితే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన....

Viral News:  స్విగ్గీ డెలివరీ బాయ్​గా మారిన‌ ఆడీ ఆర్​8 కార్​ ఓనర్​.. ప్రాంక్ కాదండోయ్
Audi R8 owner becomes a Swiggy delivery boy
Follow us on

మ‌నం యూట్యూబ్‌లో ర‌క‌ర‌కాల ప్రాంక్ వీడియోలు చూస్తుంటాం. అప్ప‌టివ‌ర‌కు అడుక్కున్న వ్య‌క్తులు… ఖ‌రీదైన కారుల్లో వెళ్లే వీడియోలు మీ కంట‌ప‌డి ఉంటాయి. అయితే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన ఆడీ ఆర్​8ను స్విగ్గీ ఫుడ్ డెలివరీకి ఉపయోగిస్తున్నాడు ఓ ఓనర్. తానే స్వయంగా ఆర్డర్లు ఓకే చేసి కస్టమర్ల ఇంటికి ఆహారాన్ని చేరవేస్తున్నాడు. ఇదేమి ప్రాంక్ వీడియో కాదండోయ్. ఇలాంటి వీడియోలను తన యూట్యూబ్ వ్లాగ్​లో పోస్టు చేసి.. కాసిన్ని డ‌బ్బుల‌తో పాటు ఫేమ్ కూడా సంపాదిస్తున్నాడు. ఓ ఆడీ ఆర్​8 ఓనర్ మాత్రం.. తన కారును స్విగ్గీ ఫుడ్​ డెలివరీకి ఉపయోగిస్తుండ‌టం చూసి జ‌నాలు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. తాను గతంలో హెచ్​2 సూపర్​బైక్​పై ఫుడ్ డెలీవరీ చేసే వాడినని, అయితే ఆడి కారును ఇందుకు ఉపయోగించొచ్చు కదా అని ప‌లువురు కోర‌డం వ‌ల్ల అలా చేస్తున్నట్లు ఓనర్ చెప్పాడు. తాను ఆడి కారు వాడటం ప్రారంభించిన‌ గంట తర్వాత మొదటి ఆర్డర్ వచ్చిందని, అనంతరం నేరుగా బేకరీకి డ్రైవ్​ చేస్కుంటూ వెళ్లినట్లు ఓనర్ చెప్పాడు. ఈ సారి కారు కావడం వల్ల బైక్​తో పోల్చితే కాస్త ఇబ్బందిక‌రంగా అన్పించినట్లు తెలిపాడు. బేకరీ నుంచి కస్టమర్ అడ్రస్​కు వెళ్లినప్పుడు ఆ ప్రదేశమంతా ఇరుకుగా ఉండ‌టంతో, కారును కాస్త దూరం ఆపి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని అత‌డు చెప్పాడు. ఆ తర్వాత మరో ఆర్డర్​ను ఓకే చేసి.. కస్టమర్​ను చేరుకున్నట్లు వీడియోలు పోస్టు చేశాడు. మొదటి రోజు రెండు ఆర్డర్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు. ట్రాఫిక్ వల్ల కాస్త ఆలస్యమైనా.. కారులో డ్రైవింగ్​ సౌకర్యవంతంగా ఉన్నట్లు ఓనర్​ చెప్పాడు. ఈ ఆడీ ఆర్​8 కారు ప్రస్తుతం మార్కెట్లోకి రావడం లేదు. అయితే సెకండ్ హ్యాండ్ కార్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి.

Also Read: శ్రీలంక పర్యటనకు భారత్ రెడీ.. ప్లేయర్ల లిస్ట్‌ ను ప్రకటించిన బిసిసిఐ..

కోవిడ్ నిబంధనలు బేఖాతర్.. రూల్స్ బ్రేక్ చేస్తూ బర్త్ డే పార్టీ.. తల్వార్లతో డాన్సులు..!