సీసీటీవీ కెమెరాల అందుబాటులోకి వచ్చినా, కట్టుదిట్టమైన భద్రతా కల్పిస్తోన్న దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలు అనే భయం కూడా లేకుండా దొంగతనాలకు దిగుతున్నారు. తాజాగా అమృత్‌సర్‌లో ఇలాంటి ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమృత్‌సర్‌లోని మాక్లీడ్ రోడ్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఇద్దరు దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం ఇద్దరు దొంగలు బ్యాంకులో నుంచి రూ. 22 లక్షల నగదు దోచుకున్నారు.
స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకులోకి ఎంటర్ అయ్యారు. వీరిలో ఒక వ్యక్తి చేతులో పిస్తోల్‌తో కస్టమర్లను చేతులు పైకెత్తమని బెదిరించారు. అనంతరం గన్‌తో క్యాషియర్‌ని బెదిరించి డబ్బును ఓ కవర్‌లో వేయమని బెదిరించాడు. దీంతో క్యాషియర్ కూడా డబ్బును మొత్తం కవర్‌లో నింపి దొంగకు ముట్టజెప్పాడు.
Amritsar: Loot of Rs. 22 lakh at gunpoint carried out in Punjab National Bank#amritsar #amritsarnews #bankrobbery #truescoop #truescoopnews pic.twitter.com/o6w4Wh4R25
— True Scoop (@TrueScoopNews) February 16, 2023
ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఈ ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ బ్యాంకు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) కార్యాలయానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఘటన జరిగిన సమయంలో బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను పంపినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్యాషియర్ దొంగకు అంతలా కొపరేట్ చేస్తున్నాడు, అందులో అతనికి ఏమైనా షేర్ ఉందా.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..