Watch Video: అర్టెంట్‌గా బాత్రూంకని వెళ్లిన మహిళ.. కమోడ్‌లో కనిపించిన సీన్‌ చూసి కళ్లు బైర్లు కమ్మేశాయ్.. బాబోయ్ అంటూ..

|

Aug 14, 2023 | 5:45 PM

కమోడ్‌లో పట్టుకున్న పాము చిన్నది కాదు. 3 నుంచి 4 అడుగుల పొడవు ఉంటుందని తెలిపారు. ఆ స్నేక్‌ క్యాచర్‌ పామును పట్టుకుని అడవిలోకి వదిలేశాడు. ఈ వీడియోను మూహా స్వర్ట్జ్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌ అవుతున్నారు. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి చాలా అరుదైన పాములని చెప్పారు. ఇలాంటి పాములు సాధారణంగా నైరుతి అమెరికాలోని ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు.

Watch Video: అర్టెంట్‌గా బాత్రూంకని వెళ్లిన మహిళ.. కమోడ్‌లో కనిపించిన సీన్‌ చూసి కళ్లు బైర్లు కమ్మేశాయ్.. బాబోయ్ అంటూ..
Snake In Toilet
Follow us on

కొందరికి టాయిలెట్ అంటే స్వర్గం. గంటల తరబడి అందులో ఉంటారు. కొందరు టాయిలెట్‌లో కూడా మొబైల్ వాడుతూ ఎంత సేపైన అక్కడే ఉంటారు. బయటి ప్రపంచంతో వారికి సంబంధం లేనట్టుగా వాష్‌రూమ్‌లోనే ఉంటారు. అయితే, ఇది వర్షాకాలం.. వానలు, వరదలతో అనేక క్రిమీ కీటకాదులు, పాముల వంటివి మురికి కాల్వల గుండా కొట్టుకువస్తుంటాయి. గ్రామాల్లో అయితే ఇలాంటి విష పూరిత పాములు, క్రిమి కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. తరచూ ఇంటి పైకప్పులో, మరుగుదొడ్డిలో తరచుగా పాములు కనిపిస్తాయి. అదే కారణంతో రాత్రిపూట లైట్ వేయకుండా టాయిలెట్‌కు వెళ్లవద్దని పెద్దలు సలహా ఇస్తారు. ఎందుకంటే.. అక్కడ పైకప్పుపైనే పాము ఉండొచ్చు. లేదంటే.. కమోడ్ రంధ్రం నుండి కూడా పాములు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కడి నుండైనా రావచ్చు. ఈ వైరల్ వార్తే అందుకు నిదర్శనం. అలాంటి ఘటనే అరిజోనాలో కూడా చోటుచేసుకుంది. అరిజోనాలోని ఇంట్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. 4 రోజుల సెలవు తర్వాత, ఆ ఇంటి యజమానురాలు.. తన ఇంటికి వచ్చినప్పుడు, ఆమె టాయిలెట్‌కు వెళ్లింది. అక్కడ కనిపించిన షాకింగ్‌ సీన్‌ చూసి ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అక్కడ కనిపించిన ఏదో నల్లటి ఆకారాన్ని నిశితంగా పరిశీలిస్తే అది పాము అని తెలిసింది.

ఆ పామును చూసిన ఆ మహిళ చలించిపోయింది. పాము కనిపించిన ఇంట్లో ఉన్న ఆ మహిళ పేరు మిచెల్ లెస్ప్రాన్. లెస్ప్రాన్ నాలుగు రోజులు ఇంట్లో లేదు. సెలవుపై బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత టాయిలెట్‌కు వెళ్లింది. టాయిలెట్‌కి వెళ్లి కమోడ్‌ మూత తీయగానే షాక్‌కు గురైంది. కమోడ్ హోల్‌లో నల్లపాము చిక్కుకుపోయి కనిపించింది. పామును తరిమికొట్టేందుకు లెస్ప్రేన్ చాలా ప్రయత్నాలు చేసింది. చేసిన ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఏం చేసినా పాము వెళ్లలేదు. దీంతో పెస్ట్ కంట్రోల్ కంపెనీ రాటిల్ స్నేక్ సొల్యూషన్స్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ పాము కమోడ్‌లో ఇరుక్కుపోయి కనిపించింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటికి వచ్చిన ఉద్యోగి కమోడ్‌లో చేయి వేసి పామును బయటకు తీశాడు. ఒకసారి ఆ పాము అతన్ని కాటు వేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. పాము తనను భయపెట్టినా అతడు వెనక్కి తగ్గలేదు. చేత్తో పామును బయటకు తీశాడు. మరో చేత్తో సెల్ ఫోన్ పట్టుకుని వీడియో తీస్తున్నాడు.

కమోడ్‌లో పట్టుకున్న పాము చిన్నది కాదు. 3 నుంచి 4 అడుగుల పొడవు ఉంటుందని తెలిపారు. ఆ స్నేక్‌ క్యాచర్‌ పామును పట్టుకుని అడవిలోకి వదిలేశాడు. ఈ వీడియోను మూహా స్వర్ట్జ్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌ అవుతున్నారు. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, కమోడ్‌లో పట్టుబడిన పామును కోచ్‌విప్ పాము అని చెబుతారు. కౌచ్‌విప్‌లు మృదువైన, సన్నగా, చాలా వేగంగా పాకుతూ వెళ్తాయని చెప్పారు. ఈ పాములు సాధారణంగా నైరుతి అమెరికాలోని ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..