కొన్నిసార్లు మనం అనుకున్నది ఒకటయితే.. అక్కడ మరొకటి జరుగుతుంది. సరిగ్గా ఇదే నిదర్శనంగా నిలుస్తూ ఓ సంఘటన అర్జంటినాలో చోటు చేసుకుంది. సముద్ర తీరం గుండా బైక్‌పై చక్కర్లు కొట్టిన ఓ వ్యక్తి ఇంటికి చేరుకోకపోవడంతో.. అతడి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ రిపోర్ట్ నమోదు చేశారు. ఆ మేరకు ఖాకీలు సైతం విచారణ చేపట్టారు. కానీ కథలో అసలు ట్విస్ట్ ఇప్పుడే చోటు చేసుకుంది. సముద్రంలోకి వెళ్లిన జాలర్లకు చిక్కిన సొరచేప పొట్ట కోయగా.. మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ ఒకటి కనిపించింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
పోలీసుల వివరాల ప్రకారం.. నెల రోజులుగా మిస్సింగ్ అయిన అర్జంటినా వ్యక్తికి సంబంధించిన అవశేషాలు సొరచేప పొట్టలో దొరికాయి. వాస్తవానికి 32 ఏళ్ల డియాగో బర్రియా ఫిబ్రవరి 18వ తేదీన సముద్ర తీరం వెంబడ బైక్‌పై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఆ తర్వాత అతడు మాయమయ్యాడు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది.
ఇదిలా ఉంటే.. 10 రోజుల క్రితం.. ఇద్దరు జాలర్ల వలకు మూడు సొరచేపలు చిక్కాయి. ఇక వాటిల్లో ఒకదాని పొట్ట కోసి చూడగా.. ఆ ఇద్దరి మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ కనిపించింది. మోచేయికి సంబంధించిన అవశేషాలు కనిపించడంతో వెంటనే కోస్టల్ గార్డులకు సమాచారం అందించారు. దాన్ని పరిశీలించగా.. అది బర్రియాకు సంబంధించినదిగా తేలింది.
‘డియాగోకు యాక్సిడెంట్ జరిగిందని అనుకున్నాం. ఆ మేరకు విచారణ చేపట్టాం. కానీ సొరచేపలో మానవ అవశేషాలు లభ్యమయ్యాయని సమాచారం అందటం.. వాటిని బర్రియా కుటుంబీకులు గుర్తించడం జరిగింది. డీఎన్‌ఏ టెస్ట్ నిర్వహించడంతో.. ఆ అవశేషాలు బర్రియాకు చెందినవిగా తేలాయని’ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మిల్లత్రుజ్ చెప్పుకొచ్చారు. కాగా, బర్రియా కనిపించకుండా పోయిన రోజు అసలేం జరిగింది.? బర్రియా సొరచేప నోటికి ఎలా చిక్కాడన్న కోణాలపై విచారణ చేపట్టామని అన్నారు.(Source)