
మనం ఏదైనా ఊరు వెళ్లినప్పుడు లేదా టూర్‌కు వెళ్లినప్పుడు హోటల్స్‌లో బస చేస్తుంటాం. రూమ్‌లోకి వెళ్లగానే అక్కడ లగ్జరీ బెడ్స్, టీవీలతో పాటు వేడి నీళ్ల కోసం లేదా కాఫీ, టీ తయారు చేసుకోవడానికి ఒక ఎలక్ట్రిక్ కెటిల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఉదయాన్నే లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉన్నవారు వెంటనే ఆ కెటిల్‌ను ఆన్ చేస్తారు. అయితే, ప్రముఖ హోటల్ నిపుణులు, ట్రావెల్ బ్లాగర్స్ ఇస్తున్న తాజా సమాచారం ప్రకారం.. హోటల్ గదిలోని కెటిల్‌ను ఉపయోగించడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
హోటల్ కెటిల్స్ వాడకూడదనడానికి అతిపెద్ద, వికారమైన కారణం ఏమిటంటే.. కొందరు ప్రయాణికుల ప్రవర్తన. సోషల్ మీడియాలో వైరల్ అయిన పలు పోస్టులు, సర్వేల ప్రకారం, చాలా మంది ప్రయాణికులు తమ కిర్తీలు లేదా అంతర్గత దుస్తులు (Undergarments), సాక్స్ వంటి వాటిని త్వరగా ఉతకడానికి లేదా వాటిలోని క్రిములను చంపడానికి ఈ ఎలక్ట్రిక్ కెటిల్స్ లోపల వేసి నీటిని మరిగిస్తున్నారు. వినడానికి అసహ్యంగా ఉన్నా, ఇది నిజమని హోటల్ సిబ్బంది సైతం అంగీకరిస్తున్నారు.
ఒకవేళ బట్టలు ఉతకకపోయినా, కెటిల్‌ను ఉపయోగించిన తర్వాత అందులో మిగిలిపోయిన నీటిని అలాగే వదిలేస్తుంటారు. రోజుల తరబడి నీరు అలాగే నిల్వ ఉండటం వల్ల కెటిల్ అడుగు భాగంలో బయోఫిల్మ్ (Biofilm) అనే ఒక రకమైన జిగట బ్యాక్టీరియా పొర, ఫంగస్ ఏర్పడతాయి. ఇవి సాధారణ కంటికి కనిపించవు.
హోటల్ రూమ్స్ క్లీన్ చేసే సిబ్బందికి చాలా తక్కువ సమయం ఉంటుంది. వారు బెడ్ షీట్లు మార్చడం, బాత్‌రూమ్ కడగడం, రూమ్ తుడవడంపై శ్రద్ధ పెడతారే కానీ, కెటిల్‌ను ప్రత్యేక డిటర్జెంట్లు లేదా వేడి నీళ్లతో లోపలి వరకు క్లీన్ చేయరు. కేవలం పైపైన గుడ్డతో తుడిచి కెటిల్‌ను మళ్లీ ఉన్నదున్నట్లుగా పెట్టేస్తారు. దీనివల్ల ముందు ఉన్న గెస్ట్‌ల ద్వారా వచ్చిన ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా తర్వాతి వారికి సులభంగా వ్యాపిస్తాయి.
హోటల్‌లో ఉన్నప్పుడు వేడి నీరు లేదా టీ కావాలంటే రూమ్ సర్వీస్‌ను అడిగి నేరుగా కిచెన్ నుండి తెప్పించుకోవడం సురక్షితం. ఒకవేళ కెటిల్ తప్పనిసరిగా వాడాల్సి వస్తే, ఉపయోగించే ముందు అందులో నీళ్లు పోసి కనీసం రెండు మూడు సార్లు బాగా మరిగించి ఆ నీటిని పారబోయాలి. వీలైతే ప్రయాణాల్లో మీతో పాటు చిన్న సైజు పర్సనల్ ఎలక్ట్రిక్ కెటిల్‌ను క్యారీ చేయడం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. పైకి ఎంతో క్లాసిక్‌గా, క్లీన్‌గా కనిపించే వస్తువుల వెనుక కూడా ఇటువంటి ఆరోగ్య ముప్పులు దాగి ఉంటాయని ఈ వైరల్ వార్త ప్రయాణికులను హెచ్చరిస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..