Ants Build Bridge: కందిరీగల గూడుపై దాడికి ‘బ్రిడ్జి కట్టిన’ చీమల దండు…..వైరల్ వీడియో చూడాల్సిందే !

ఛీమే కదా అని చులకనగా చూస్తే అది పెద్ద 'తప్పిదమే' అవుతుంది. ముఖ్యంగా 'సైనిక చీమల' సామూహిక 'శక్తి'ని తక్కువగా అంచనా వేయరాదంటున్నారు....

Ants Build Bridge: కందిరీగల గూడుపై  దాడికి బ్రిడ్జి కట్టిన  చీమల దండు.....వైరల్ వీడియో చూడాల్సిందే !
Ants Build Bridge

Edited By: Phani CH

Updated on: Jun 19, 2021 | 6:55 PM

ఛీమే కదా అని చులకనగా చూస్తే అది పెద్ద ‘తప్పిదమే’ అవుతుంది. ముఖ్యంగా ‘సైనిక చీమల’ సామూహిక ‘శక్తి’ని తక్కువగా అంచనా వేయరాదంటున్నారు. ఇదంతా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే.. బ్రెజిల్ లో జరిగిన ఓ వింత గురించి తెలుసుకోవలసిందే. ఆ దేశంలో .ఒక చోట ఓ భవనం పైకప్పు కింద కందిరీగలు పెట్టిన గూడుపై దాడికి కోట్లాది చీమలతో కూడిన ‘సైన్యం’ బయలు దేరింది. గూడును, గోడను కలిపివేస్తూ అవి ఏకంగా ఓ ‘బ్రిడ్జినే’ కట్టేశాయి. అంటే ఇక తమ గూడు వద్దకు వెళ్ళడానికి ఏ కందిరీగ కూడా సాహసించదన్న మాట ! ఈ చీమల ‘వంతెన’ తాలూకు వీడియో ఎప్పడో.. పాతది.. 2018 నాటిదైనా ఓ ఎలెక్ట్రికల్ ఇంజనీరు దీన్ని మళ్ళీ తాజాగా ఆన్ లైన్ లో షేర్ చేశాడు. ఈయనకు తమ బ్రెజిల్ లో ఇలాంటి అరుదైన దృశ్యాల వీడియోలంటే చాలా ఇష్టమట.’ఎటాక్ ఆఫ్ లెజియోనరీ యాంట్స్’ చూడండి అని అయన కామెంట్ చేశాడు. బ్రిడ్జిని కట్టడానికి చీమలు ఉపయోగించిన తెలివికి, వాటి సామూహిక లక్ష్యానికి హ్యాట్సాప్ అని ఆయన ప్రశంసించాడు. లెజియోనరీ యాంట్స్ అంటే 200 రకాల చీమల జాతులని కూడా ఆయన అంటున్నాడు.

ఇలాంటి దాడులను పసిగట్టిన కందిరీగలు సాధారణంగా పారిపోతాయని…ఇక చీమలు గూడును పూర్తిగా నాశనం చేసేంతవరకు వదలవని ఆ ఇంజనీర్ అంటున్నాడు. అవి నీళ్లలో కూడా ఇలాంటి వంతెనలను కడతాయట…ఈ వీడియోను చూసిన నెటిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ కందిరీగల గూడును అవి ఎలా ఛేదిస్తాయో చూడాలని ఉందని ఒకరంటే….చిన్నదని చీమను చులకన చేసి చూడరాదని ఇంకొకరు అంటున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: డల్ గా ఉన్న కిచెన్ ని.. నాణేలతో అందంగా తీర్చి దిద్దింది… ఎక్కడంటే… ?? ( వీడియో )

Curry Leaves Tea : కరివేపాకు తినటం లేదా అయితే అయితే టీ చేసుకోని తాగండి.. లాభాలెన్నో..! ( వీడియో)