Viral: మంచు కొండల్లో అదో మాదిరి వింత ఆకారం.. విషయం తెలిస్తే.. అయ్యబాబోయ్.!

|

Oct 17, 2024 | 5:33 PM

గూగుల్ మ్యాప్స్‌లో అంటార్కిటికాలోని షోవా స్టేషన్ సమీపంలో ఒక వింత ఆకారం కనిపించింది. ఇది నాజీల స్థావరం, గ్రహాంతరవాసుల నివాసం లేదా విమాన ప్రమాదానికి సంబంధించి అయి ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే, శాస్త్రవేత్తలు ఇది మంచుకొండ అని, భూమిపైకి చేరి కరిగిపోతోందని వివరించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral: మంచు కొండల్లో అదో మాదిరి వింత ఆకారం.. విషయం తెలిస్తే.. అయ్యబాబోయ్.!
Viral
Follow us on

ప్రాంతం ఏదైనా, ప్రదేశం ఎక్కడైనా.. కొండ ఎక్కడుందో.. కొలను ఎలా ప్రవహిస్తోందో.. ఇలా మనకు కావాల్సిన మ్యాపింగ్ సమాచారాన్ని గూగుల్ మ్యాప్స్ అందిస్తుంటాయి. ఇంతవరకు అయితే పర్లేదు.. గూగుల్ మ్యాప్స్‌లో ఎప్పుడూ చూడని ఓ వింత ఆకారం దర్శనమిస్తే.. ఇంకేమైనా ఉందా.? నెట్టింట కథలు కథలు క్షణాల్లో పుట్టుకొస్తాయి. ఏంటీ.? ఇది నిజమేనా.? అని అనుకుంటున్నారా.! అవును.. మంచుతో కప్పి ఉన్న అంటార్కిటికాలో వింతైన డోర్ వే ఒకటి కనిపించింది. అది కూడా తూర్పు అంటార్కిటికాలోని జపాన్‌కు చెందిన షోవా స్టేషన్ సమీపంలో దీన్ని గుర్తించారు. మొదటిగా రెడ్డిట్ యూజర్లు ఈ డోర్ వే‌ను గూగుల్ మ్యాప్స్‌లో కనుగొన్నారు. అది నాజీల స్థావరమా.? లేక ఏ గ్రహాంతర వాసి లేక ఏదైనా వింత ఆకారం కలిగిన బిగ్ ఫుట్ జీవికి సంబంధించిన వెకేషన్ హోమా అంటూ నెట్టింట హోరెత్తిస్తున్నారు.

ఇది చదవండి: ఓర్నీ.! ఇంత ఈజీనా.. ఈ ఫోటోలో ‘3’ నెంబర్ కనిపెట్టగలరా..

@Conspiracy అనే పేరుతో ఉన్న రెడ్డిట్ అకౌంట్ దీన్ని ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసింది. గూగుల్ మ్యాప్స్ కోఆర్డినేట్స్ ప్రకారం 69°00’50″S 39°36’22″E దగ్గర ఈ వింతైన ఆకారం కనిపించిందట. ఒక నెటిజన్.. అంటార్కిటికాలో ఇదొక మిస్టీరియస్ డోర్ అని కామెంట్ చేయగా.. మరొకరు ఎగిరొచ్చిన బోయింగ్ విమానం డోర్ అని.. ఇటీవల జరిగిన విమానాన్ని ప్రమాదాన్ని గుర్తు చేశాడు. అయితే శాస్త్రవేత్తలు ఈ అంశంపై పూర్తి భిన్నంగా చర్చించుకుంటున్నారు.

ఇది చదవండి: సరిపోదా శనివారంలో నాని అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెల్సా.? బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

న్యూకాజిల్ విశ్వవిద్యాలయంలో గ్లేషియాలజీ ప్రొఫెసర్ అయిన బెతాన్ డేవిస్, ‘అదొక మంచుకొండ అని.. అది భూమిపైకి చేరి.. ఇప్పుడు కరిగిపోతోందని’ చెప్పింది. మీరు ఆ ప్రాంతంలో అనేక ఇతర మంచుకొండలను కూడా చూడొచ్చునని పేర్కొంది. ‘అది కేవలం మంచు మాత్రమేనని.. ఆ మంచు కింద ఏదో గ్లాస్ మాదిరి వస్తువు లాంటిది ఉండి ఉండొచ్చునని ప్రొఫెసర్ మార్టిన్ సీగర్ట్ చెప్పారు. కాగా, ఆ వింతైన ఆకారం ఏదైనా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

ఇది చదవండి: సింగిల్స్ చూడాల్సిన మూవీ.! ఓటీటీలో బోల్డ్ సీన్స్‌తో రచ్చ రంబోలా..

Massive door in Antarctica? 3/20/24
byu/realg00n inconspiracy

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..