Ant smuggling in Kenya: చీమలను స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్.. మార్కెట్ లో రాణి చీమల విలువ తెలిస్తే షాక్

ఏనుగు దంతాలను, పులి చర్మాలను లేదా అరుదైన తాబేళ్లు వంటి జీవులతో పాటు మత్తు పదార్ధాలను, బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను దోషులుగా పట్టుకున్న సంఘటలు గురించి విని ఉంటారు. అయితే ఇప్పటి వరకూ చీమలను అక్రమంగా రవాణా చేస్తున్న కొంతమంది వ్యక్తులను పట్టుకున్నారు. భారీ మొత్తంలో జరిమానా విధించారు. ఈ ఘటన కెన్యాలో చోటు చేసుకుంది. కోట్ల విలువ చేసే చీమల గురించి తెలుసా..

Ant smuggling in Kenya: చీమలను స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్.. మార్కెట్ లో రాణి చీమల విలువ తెలిస్తే షాక్
Ant Smuggling In Kenya

Updated on: May 09, 2025 | 6:51 PM

ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ముల అక్రమ రవాణా గురించి వినే ఉంటారు,. అయితే ఇప్పుడు వేటగాళ్ళు సరికొత్త జీవులను స్మగ్లింగ్ చేయడం మొదలు పెట్టారు. మన పర్యావరణానికి విలువైన చిన్న చీమలను ( యాంట్ స్మగ్లింగ్ ) కూడా అక్రమ రవాణా చేయడం ప్రారంభించారు. ఈ షాకింగ్ ఘటన కెన్యాలో చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్లతో సహా నలుగురు వేలాది చీమలను అక్రమ రవాణా చేసినట్లు నిర్ధారించిన కోర్టు వారికి $7,700 (మన దేశ కరెన్సీలో . 6.5 లక్షలకు పైగా) భారీ జరిమానా విధించింది. మైనర్లు జరిమానా చెల్లించకపోతే వారికి 12 నెలల జైలు శిక్ష విధించాలని కూడా కోర్టు పేర్కొంది.

కెన్యా అధికారులు ఏప్రిల్ 5న దాడి చేసి ఇద్దరు బెల్జియన్ యువకులను, ఒక వియత్నామీస్ జాతీయుడిని, ఒక స్థానికుడిని అరెస్టు చేశారు. వారి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 5,440 జెయింట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ క్వీన్ యాంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సహజంగానే చీమలను అక్రమ రవాణా చేయడం ఏమిటి? ఈ చీమలతో వారు ఏమి చేస్తారో అని మీరు ఆలోచిస్తుంటే సమాధానం తెలుసుకోండి..

నిజానికి స్మగ్లర్లు స్మగ్లింగ్ చేస్తున్న చీమలు రాణి చీమలు. వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒకొక్క చీమ ధర వింటే షాక్ అవుతారు. ఆసియా, ఉత్తర అమెరికా, యూరప్ ఆన్‌లైన్ మార్కెట్‌లో ఈ చీమల ధర 8,00,000 యూరోలు (భారత కరెన్సీలో రూ. 7 కోట్ల 66 లక్షలకు పైగా) అని మేజిస్ట్రేట్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

రాణి చీమలు ఎందుకు అంత ఖరీదైనవి అంటే ?

గుడ్లు పెట్టగల ఏకైక చీమ ఇదే. దాని నుండే మొత్తం చీమల కాలనీ అంటే కార్మికులు, సైనికులు, భవిష్యత్ రాణులు పుడతారు. ఈ రాణి చీమల అక్రమ రవాణా వలన కెన్యా వన్యప్రాణుల పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది.

తమను తాము చీమల ప్రేమికులుగా అభివర్ణించుకునే బెల్జియన్ యువకులు లార్నోయ్ డేవిడ్ , సెప్పే లోడెవిజ్క్స్.. తమకు అసలు చీమల గురించి ఏమీ తెలియదని.. అందుకనే ఇదంతా చేశామని కోర్టులో పేర్కొన్నారు. అయితే నిందితుల మాటలను విశ్వసించని అధికారులు .. లోర్నోయ్ ఫోన్‌ని తనిఖీ చేశారు. అతని చీమల గురించి కోర్టు లో చెప్పిందంతా అబద్ధం అని అతను ‘యాంట్ గ్యాంగ్’ అనే గ్రూపులో సభ్యుడిని తెలుసుకున్నారు. అతను 2,500 రాణి చీమలను 200 డాలర్లకు (సుమారు 17 వేల రూపాయలు) కొన్నాడు. చీమలను భారీ సంఖ్యలో సేకరించడం అతనికి హాబీ కాదని కోర్టుకి అధికారులు చెప్పారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..