Viral Video: తాతకు సాయం చేసిన కోతి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్స్..

|

Dec 02, 2021 | 8:41 PM

Monkey Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని వీడియోలు నవ్వులు తెప్పిస్తుంటే..

Viral Video: తాతకు సాయం చేసిన కోతి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్స్..
Monkey Viral Video
Follow us on

Monkey Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని వీడియోలు నవ్వులు తెప్పిస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురించేస్తుంటాయి. అయితే.. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కోతి.. ఓ వ్యక్తి సాయం చేస్తోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి కోతులు ఎప్పుడూ కొంటెగా.. ఉల్లాసంగా ఉంటాయి. అవి సంచరించే ప్రాంతాల్లో వస్తువులను చిందరవందరగా పడేయడం.. చిలిపి చేష్టలు చేయడం వాటిపనిగా ఉంటుంది. ఎక్కువగా చెట్లపైనే కనిపిస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కోతులు ఆడుకుంటూ.. మనుషులపై విరుచుకుపడటం, కరవడం లాంటివి చేస్తుంటాయి. అయితే.. అలా కాకుండా ఓ కోతి బుద్ధివంతురాలిగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. కోతి చేతిలో కర్ర ఉంది.. అయితే.. అక్కడున్న వృద్ధుడికి ఆ కర్ర అవసరం అవుతుంది. వీడియోలో రోడ్డుపై నిలబడి ఉన్న ఓ వృద్ధుడిని కూడా చూడవచ్చు. అతను రోడ్డు పక్కన ఉన్న కోతి నుంచి చిన్న కర్ర ఇవ్వాలంటూ అడుగుతున్నాడు. దీంతో కోతి కూడా వెంటనే కర్రను తీసుకుని వెళ్లి వృద్ధుడికి ఇస్తుంది. అయితే.. కర్ర ఇవ్వకపోతే.. వృద్ధుడు తనను కొడతాడేమోననుకొని.. భయపడుతూ కర్రను ఇచ్చి కోతి పారిపోతుంది.

వైరల్ వీడియో.. 

ఈ వీడియో కోతిలో కూడా మానవత్వ గుణం ఉందన్న విషయాన్ని చూపిస్తోందంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తుందని.. వీడియో అద్భుతంగా ఉందంటూ పేర్కొంటున్నారు. బ్యూటిఫుల్‌ఫుల్‌గ్రామ్ పేరుతోఉన్న యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి.. పలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: రన్‌వేపై విమానాన్ని నెడుతున్న జనం.. వీడియో చూసి పొట్ట చక్కలయ్యేలా నవ్వుకుంటున్న నెటిజన్లు..

Viral Video: ఏనుగుల ప్రాంతానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్న టూరిస్ట్‌లు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..