Wine Shop Attack: మద్యం షాపులోకి దూసుకెళ్లిన మహిళలు.. వైరల్‎గా మారిన వీడియో..

మద్యం అమ్మకాలు ఆపాలంటూ వారు పోరాటం చేస్తున్నారు. అయినా అమ్మకాలు కొనసాగించడంతో వారు సహనం కోల్పోయారు. మద్యం షాపుపై దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది...

Wine Shop Attack: మద్యం షాపులోకి దూసుకెళ్లిన మహిళలు.. వైరల్‎గా మారిన వీడియో..
Attack

Updated on: Nov 16, 2021 | 11:25 AM

మద్యం అమ్మకాలు ఆపాలంటూ వారు పోరాటం చేస్తున్నారు. అయినా అమ్మకాలు కొనసాగించడంతో వారు సహనం కోల్పోయారు. మద్యం షాపుపై దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలో మద్యం షాపులోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిక్కమగళూరు జిల్లా ముస్లాపుర గ్రామంలో శనివారం మహిళలు మద్యం దుకాణంపై దాడి చేశారు. గ్రామంలో గతంలో రెండు సార్లు మద్యం షాపు తెరవడాన్ని మహిళలు వ్యతిరేకించారు. మహిళలు చెబుతున్నా లెక్కచేయకుండా మద్యం దుకాణాన్ని తెరిచారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 50 మంది మహిళలు, స్థానికుల సహకారంతో మద్యం దుకాణాన్ని మూసివేయాలని నిర్ణయించారు.

మహిళలు మొదట మద్యం దుకాణం వద్ద ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వ్యక్తులను ప్రశ్నించగా మద్యం షాపును మూసివేయడానికి అంగీకరించలేదు. దీంతో మహిళలు లోపలికి దూసుకెళ్లారు. మద్యం దుకాణంలోని టేబుల్‌లు, కుర్చీలు ధ్వంసం చేశారు. మహిళలు లోపలికి వెళ్లేలోపు మద్యం బాటిళ్లను తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బార్ తెరవడానికి అనుమతిస్తే తమ భర్తలు తమను ఏమీ లేకుండా మద్యానికి ఖర్చు చేస్తారని మహిళలు పేర్కొన్నారు.

Read Also.. Hyd Dancer Death: అర్ధనగ్న స్థితిలో మహిళా డాన్సర్ మృతి.. కారణం ఇదేనా..? ఆర్కేస్ట్రా ట్రూపులో డ్యాన్సర్‌గా ఫాతిమా.. (వీడియో)