Viral Video: ప్రస్తుతమంతా సోషల్ మీడియాదే హవా..ఇంటర్‌నెట్ పుణ్యమా అని రోజుకో కొత్త డిస్కషన్, చాలెంజ్, వింతలు, విడ్డూరాలు చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే రకరకాల వీడియాలు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. మారుమూల పల్లైనా లేదా సిటీ అయినా ఎక్కడ ఆసక్తికర సంఘటన జరిగినా నెటిజన్లు దానిని వైరల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి రాగా, సోషల్ మీడియాలో ప్రస్తుతం అది తెగవైరలవుతోంది.
ఈ వీడియోలో ఓ వ్యక్తిని దేనికో భయపడి వేగంగా పరుగులు తీస్తున్నాడు..ఏంటా అని తీరా చూస్తే..అతన్ని తరుముకొచ్చింది ఓ కోడి…అది అతన్ని వెంబడి మామూలుగా పరిగెత్తటం లేదు..ఓ రేంజ్‌లో ఉరికించింది..కోడికి పోటు నుంచి తప్పించుకునేందుకు అతడు ఓ ఇంట్లోకి పరిగెత్తాడు…అయిన అది అతన్ని విడిచిపెట్టలేదు..మరింత వేగంగా వెంబడించింది…అతడు ఓ ఎత్తైన తడక లాంటి ఓ నిర్మాణం దగ్గర ఒక్క జంప్ చేసి తప్పించుకోబోయాడు..కానీ, పాపం ఆ కోపిష్టికి కోడికి దొరికిపోయాడు..ఒంటిమీద బట్టలు చిరిగిపోయేలా అది అతన్ని చీల్చి చెడ్డాడినంత పనిచేసింది. ఇక పోతే, ఇదంతా అక్కడి స్థానికులు కొందరు తమ సెల్‌ఫోన్లతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వీడియో కాస్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇది చూసి నెటిజనాలు తెగ నవ్వుకుంటున్నారు. ఏంటీ గురూ..ఇది ఓ కోడికి భయపడి నిలువెత్తు మనిషి ఇలా పరిగెత్తడం ఎంటండి…అంటూ ఫన్నీ కామెంట్,చేయగా దాన్ని కోసి ఫ్రై చేసుకుంటే పోలా అంటూ ఇంకొందరు, వెరీ ఫన్నీ వీడియో అంటూ పోస్టులు పెడుతున్నారు వావ్…కోడి గొప్పగా ఫైట్ చేసిందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video:
Also read:
Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..
Ramya Krishna: మెగాస్టార్ సినిమాలో రమ్యకృష్ణ.. కీలక పాత్రలో నటించనున్న శివగామి..