Viral: తవ్వకాల్లో బయల్పడిన అద్భుతం.. ఏకంగా శ్రీ రాములవారు పూజించిన…

|

Sep 15, 2022 | 9:52 AM

తమిళనాడులో పురాతన శివలింగం బయల్పడింది. ఇది సాక్షాత్తూ శ్రీరాముడు పూజించిన లింగంగా భావిస్తున్నారు అక్కడి స్థానికులు.

Viral: తవ్వకాల్లో బయల్పడిన అద్భుతం.. ఏకంగా శ్రీ రాములవారు పూజించిన...
Shivalingam
Follow us on

Tamil Nadu: తమిళనాడులో అద్భుత ఘటన వెలుగుచూసింది. పరమ శివుడి పురాతన లింగం పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. దీంతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. హరహర మహాదేవ.. శంభో శంకర.. నమ: శివాయ అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. శివగంగ జిల్లా(Sivaganga District) నానామడైలో ఈ ఘటన వెలుగుచూసింది. కాగా ఈ అద్భుత లింగం గురించిన విశేషాలను పురావస్తు శాఖ అధికారి సెంధిల్‌మురుగన్‌ క్లుప్తంగా వివరించారు. సీతమ్మను దుష్ట రావణాసురుడి చెర నుంచి విడిపించేందుకు.. వానర సైన్యంతో కలిసి శ్రీరామచంద్రుడు లంకకు బయలుదేరాడు. మార్గమధ్యంలో తమకు విజయం చేకూరాలని అనేక చోట్ల.. శివలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు పూర్వికుల ద్వారా తెలిసిందని సెంధిల్‌మురుగన్‌ వెల్లడించారు. ఈ క్రమంలోనే రాములవారు.. తమిళనాడు గుండా వెళ్లినప్పుడు.. నానామడై వద్ద ప్రతిష్ఠించిన శివలింగం కాలం సాగుతన్న కొద్దీ భూగర్భంలోకి వెళ్లిందని.. తాజాగా జరిపిన తవ్వకాల్లో బయటపడిందని.. వివరించారు. దీంతో అది సాక్షత్తూ రామయ్యతండ్రి పూజించిన లింగంగా భావించి.. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి పూజలు చేస్తున్నారు. రాముడు నడయాడిన ఈ ప్రాంతంలో మరింత పరిశోధనలు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే.. శివలింగం బయల్పడిన చోట గుడి నిర్మాణానికి పూనుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి