Viral Video: మడతపెట్టే ఫోన్‌లే కాదు ఇళ్లు కూడా వచ్చేశాయ్‌.. ఈ ఫోల్డబుల్‌ ఇంటిని చూస్తే స్టన్‌ అవ్వాల్సిందే.

|

Jan 18, 2023 | 7:18 AM

పెళ్లి చేసి చూడాలి.. ఇల్లు కట్టి చూడాలి'.. ఇది ఎప్పటి నుంచో ఉన్న సామెత. మనిషి జీవితంలో పెళ్లికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇంటికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందనేది ఈ సామెత అర్థం. అందుకే పెళ్లి విషయంలోనూ, ఇంటి నిర్మాణం విషయంలోనూ..

Viral Video: మడతపెట్టే ఫోన్‌లే కాదు ఇళ్లు కూడా వచ్చేశాయ్‌.. ఈ ఫోల్డబుల్‌ ఇంటిని చూస్తే స్టన్‌ అవ్వాల్సిందే.
Foldable Home
Follow us on

‘పెళ్లి చేసి చూడాలి.. ఇల్లు కట్టి చూడాలి’.. ఇది ఎప్పటి నుంచో ఉన్న సామెత. మనిషి జీవితంలో పెళ్లికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇంటికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందనేది ఈ సామెత అర్థం. అందుకే పెళ్లి విషయంలోనూ, ఇంటి నిర్మాణం విషయంలోనూ అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉంటే ఇంటి నిర్మాణంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. సాధారణ బిల్డింగ్‌ల నుంచి డూప్లెక్స్‌ల వరకు ఇళ్ల నిర్మాణంలో మార్పులు వచ్చాయి, వస్తున్నాయి. ఇక ఓ అడుగు ముందుకేసి మడతపెట్టే ఇళ్లు కూడా వచ్చేశాయ్‌.

ఈ ఇంటిని ఎంచక్కా మడతపెట్టేసి నచ్చిన చోటుకి తీసుకెళ్లిపోవచ్చు. మడత పెట్టే ఇళ్లు అంటే అదేదో సాధారణంగా ఉంటుందనుకోకండి.. ఇంటి లోపల లగ్జరీగా ఉంటుంది. తాజాగా ఈ ఫోల్డబుల్‌ ఇంటికి సంబంధించిన వీడియోను ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేశారు. దీంతో ఈ అంశం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ ఫోల్డబుల్ హౌస్‌గా పిలిచే ఈ ఇంటిని 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టూడియో అపార్ట్ మెంట్ మాదిరిగా నిర్మించారు. ఈ ఇంటి నిర్మాణానికి 49,500 డాలర్లు ఖర్చు అవుతుంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 40 లక్షలు అవుతుంది. ఈ ఇంటిలో ఓపెన్‌ కిచెన్‌, బెడ్‌ రూమ్‌, హాల్‌ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇంటిని అన్‌ఫోల్ట్ చేస్తున్న వీడియోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. ‘ఈ ఇంటి నిర్మాణానికి రూ. 40 లక్షలు ఖర్చవుతుంది. అయితే భారత్‌లో ఈ నిర్మాణ ఖర్చు మరింత తగ్గే అవకాశాలు ఉంటాయి. విపత్తులు జరిగిన చోట త్వరగా షెల్టర్‌ల ఏర్పాటుకు ఇది సరిగ్గా సరిపోతుంది. అందుబాటు ధరలకే ఇళ్లను అందించాలన్న మన సమస్యలకు ఆవిష్కరణలే సమాధానం’ అంటూ ట్వీట్ చేశారు. అవుతాయి’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ ఫోల్డబుల్ ఇంటికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..