ఒకప్పుడు దుస్తులు ఉతకం పెద్ద టాస్క్.. అయితే ఎప్పుడైతే వాషింగ్ మిషిన్స్ అందుబాటులోకి వచ్చాయో ఆ కష్టం తప్పింది. మిషిన్‌లో దుస్తులు వేసి స్విచ్ ఆన్ చేస్తే ఉతికి, ఆరేయడం అంతా దానంతట అదే చేసుకుపోతోంది. అయితే ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా మనుషులు చేసే కొన్ని పనులు మాత్రం యంత్రాలు చేయలేవు. అలాంటి వాటిలో దుస్తులు మడతం పెట్టడం కూడా ఒకటి. మనుషులే దుస్తులను మడతపెట్టాలి.
అయితే బట్టలు ఉతకడం ఎంత పెద్ద టాస్కో.. వాటిని నీటిగా మడతపెట్టడం కూడా అంతే టాస్క్ అని చెప్పాలి. ఎక్కడికైనా వెళ్లేప్పుడు దుస్తులను జాగ్రత్తగా ఫోల్డ్ చేసిన బ్యాగులో పెట్టుకొని వెళ్లడం చాలా మందికి ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే మాత్రం దుస్తులను మడతపెట్టడం ఇంత సులువని అనిపించకమానదు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Fascinating. How innovation & design skills can bring huge productivity in such simple activities. Wish I had seen this video decades ago when I traveled like a maniac and was packing & re-packing every few days. https://t.co/mEXfa4TFP1
— anand mahindra (@anandmahindra) March 2, 2023
ఈ వీడియో చూస్తే దుస్తులను ఇంత అందంగా మడతపెట్టొచ్చా అనిపిస్తోంది. మస్సిమో అనే ప్రముఖ ఇంజనీర్ పోస్ట్ చేసిన ఓ వీడియోను రీట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్ర.. ‘సాధారణంగా చేసే పనులను సింపుల్ టెక్నిక్స్ కొత్త ఇన్నోవేషన్ అండ్ డిజైన్ నైపుణ్యాలు ఆవిష్కారానికి నాంది పలుకుతాయి. ఏళ్లుగా ప్యాకింగ్‌లు చేసుకుంటూ ప్రపంచమంతా తిరుగుతున్న నాకు ఈ వీడియో ముందే ఎందుకు కనిపించలేదు’ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..