Viral Video: వాట్‌ ఎన్‌ ఐడియా సర్జీ..! నిమిషాల్లో రెస్టారెంట్‌గా మారిన ఫుడ్ ట్రక్.. ఆనంద్ మహీంద్రానే అవాక్కయ్యారంటే..

|

Feb 22, 2024 | 7:24 PM

ఇప్పటికే వీడియోని 2 లక్షల 47 వేల మందికి పైగా చూడగా, చాలా మంది దీనిపై కామెంట్లు కూడా చేశారు. ఈ కొత్త టెక్నాలజీని ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. దీనిపై వినియోగదారులు స్పందిస్తూ.. భారతదేశంలో, దీని పేరు త్వరలో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌గా మారనుందని వ్యాఖ్యనించారు. మరోకరు స్పందిస్తూ.. ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌ వ్యాపారి ఒక మేనేజర్ కంటే ఎక్కువగా సంపాదిస్తూ ఉండాలన్నారు.

Viral Video: వాట్‌ ఎన్‌ ఐడియా సర్జీ..! నిమిషాల్లో రెస్టారెంట్‌గా మారిన ఫుడ్ ట్రక్.. ఆనంద్ మహీంద్రానే అవాక్కయ్యారంటే..
Chinese Food Truck
Follow us on

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాకు పరిచయం అక్కర్లేని పేరు. మహీంద్రా సంస్థల అధినేత అయిన ఆనంద్‌ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. ఎన్నో ఆసక్తికర విషయాలు,స్పూర్తివంతమైన సంఘటనలకు సంబంధించిన విషయాలు, వీడియోలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్రస్తుత టెక్నాలజీపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. మరీ ఇంతలానా అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు చాలా మంది నెటిజన్లు. తొలుత వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా సైతం అవాక్కయ్యారట. నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ వీడియో గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ సారి చైనీస్ ఫుడ్ ట్రక్ వీడియోను పోస్ట్ చేశారు ఆనంద్‌ మహీంద్రా..ఆ వీడియోలో ఒక ట్రక్కు చుట్టూ ఖాళీగా ఉన్న ప్రదేశంలో వచ్చి ఆగింది. ఆ ట్రక్కు చూస్తుండగానే.. నిమిషాల వ్యవధిలో పూర్తిగా రెస్టారెంట్‌గా మారిపోయింది. మొదటి ట్రక్ గేటు తెరుచుకుంటుంది. ఇది రెస్టారెంట్ దాంతో రెస్టారెంట్‌లోకి మెట్లుగా మారాయి. ఆ తరువాత ట్రక్ అన్ని వైపుల నుండి ఒక్కొక్కటిగా ఓపెన్‌ కావటం ప్రారంభిస్తుంది. అది హోటల్ లాగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

కేవలం 24 సెకన్ల వీడియో చూసిన తర్వాత ఇది సాధ్యమేనా అని మీరు కూడా ఆలోచిస్తారు. కానీ, చైనాలో ఇది ఖచ్చితంగా సాధ్యమే. దీన్ని షేర్ చేస్తున్నప్పుడు, ఆనంద్ మహీంద్రా క్యాప్షన్‌లో ఇలా రాశారు..ఫాస్ట్ ఫుడ్, ఫుడ్ ట్రక్కులు, ఇప్పుడు ఫాస్ట్ రెస్టారెంట్లుగా మారిపోయాయ్‌.. వ్యాపారం పూర్తికాగానే.. లొకేషన్ నుండి మొత్తం రెస్టారెంట్‌లను ఖాళీ చేసే కొత్త వ్యాపార నమూనా ఇది. మార్కెట్‌ ఉన్న ప్రతిచోటాకు ట్రక్‌ రెస్టారెంట్‌ వెళ్తుంది.

ఇప్పటికే వీడియోని 2 లక్షల 47 వేల మందికి పైగా చూడగా, చాలా మంది దీనిపై కామెంట్లు కూడా చేశారు. ఈ కొత్త టెక్నాలజీని ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. దీనిపై వినియోగదారులు స్పందిస్తూ.. భారతదేశంలో, దీని పేరు త్వరలో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌గా మారనుందని వ్యాఖ్యనించారు. మరోకరు స్పందిస్తూ.. ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌ వ్యాపారి ఒక మేనేజర్ కంటే ఎక్కువగా సంపాదిస్తూ ఉండాలన్నారు. మరో వినియోగదారు స్పందిస్తూ.. ఇప్పుడు ఫాస్ట్ హాస్పిటల్ కూడా రాబోతుందని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..