ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాల తీవ్ర కలకలం రేపుతున్నాయి. అప్పటి వరకు ఆరోగ్యం ఉన్న వ్యక్తులు ఉన్నట్టుండి అమాంతంగా కుప్పకూలి ప్రాణాలు విడిచిపెడతున్న ఘటనలు ప్రజల్న భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో ప్రతి నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో హార్ట్‌ఎటాక్‌కు గురైన వ్యక్తికి సీపీఆర్ అందిచటం వల్ల వారు ప్రాణాలతో బయటపడిన ఘటనలు కూడా అనేకం చూశాం.. అయితే, అలాంటి వీడియో ఒకటి తాజాగా వెలుగులోని వచ్చింది. అందులో ఒక TTE రైలులో ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. ఈ వీడియోను నార్త్ ఈస్టర్న్ రైల్వే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
నార్త్ ఈస్టర్న్ రైల్వే తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియో వేగంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో CPR ద్వారా TTE ఒక ప్రయాణికుడి ప్రాణాలను రక్షించడం కనిపిస్తుంది. కదులుతున్న రైలులో ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. అతడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా, టీటీఈ అతనికి సీపీఆర్ అందించి ప్రాణం పోశాడు. అనే క్యాప్షన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది.
ఈ సంఘటన రైలు నంబర్ 15708 ‘ఆమ్రపాలి ఎక్స్‌ప్రెస్’ జనరల్ కోచ్‌లో జరిగిందని సమాచారం. ఇందులో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీని కారణంగా అతడు వెంటనే స్పృహ కోల్పోయాడు. అయితే అక్కడికక్కడే అవగాహన కల్పిస్తూ రైలులో ఉన్న టీటీఈ మన్మోహన్ ఆ వ్యక్తికి సీపీఆర్ ఇవ్వడం ప్రారంభించారు. కొద్ది క్షణాల్లో అతడు కళ్ళు తెరిచి, స్పృహలోకి వచ్చాడు. అనంతరం అతన్ని ఛప్రా రైల్వే స్టేషన్‌లోని ఆసుపత్రికి తరలించారు.
వీడియో ఇక్కడ చూడండి..
टीटीई की तत्परता से मिला ‘जीवनदान’
ट्रेन संख्या 15708 ‘आम्रपाली एक्सप्रेस’ के जनरल कोच में सफ़र के दौरान 70 वर्षीय एक यात्री को हार्ट अटैक आने पर तैनात टीटीई ने बिना समय गंवाए CPR दिया और यात्री की जान बचाई। तत्पश्चात छपरा रेलवे स्टेशन पर यात्री को अस्पताल भेज दिया गया। pic.twitter.com/vxqsTEkir7— Ministry of Railways (@RailMinIndia) November 23, 2024
ఈ మేరకు రైల్వే న్యూస్ బ్యూరో పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, రైలు నంబర్ 15708లో త్వరితగతిన స్పందించి ప్రాణాలను రక్షించినందుకు TTE మన్మోహన్‌కు బిగ్ సెల్యూట్ అంటూ పేర్కొంది. అతని సమయస్పూర్తిని అధికారులు, సిబ్బంది ఎంతగానో మెచ్చుకున్నారు. అతని ధైర్యం, చకచాక్యంగా స్పందించిన తీరు ఆ మనిషి జీవితాన్ని కాపాడింది అంటూ పలువురు నెటిజన్లు సైతం ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియోకి వేల సంఖ్యలో వ్యూస్, లైకులు వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..