Viral: ఊరి చివర్లో దొరికిన ప్లాస్టిక్ సంచి.. ఇంటికి తీసుకురాగా.. చివరికి ఊహించని సీన్!

|

Jul 09, 2022 | 9:46 PM

భవన నిర్మాణ పనులు చేసే అశోక్ అనే వ్యక్తి.. ఊరి చివర దొరికిన ఓ ప్లాస్టిక్ సంచిని ఇంటికి తీసుకొచ్చాడు. దాన్ని భద్రంగా అటకపై దాచాడు.

Viral: ఊరి చివర్లో దొరికిన ప్లాస్టిక్ సంచి.. ఇంటికి తీసుకురాగా.. చివరికి ఊహించని సీన్!
Representative Image 1
Follow us on

భవన నిర్మాణ పనులు చేసే అశోక్ అనే వ్యక్తి.. ఊరి చివర దొరికిన ఓ ప్లాస్టిక్ సంచిని ఇంటికి తీసుకొచ్చాడు. దాన్ని భద్రంగా అటకపై దాచాడు. అతని భార్య ఏవో వస్తువుల అటకపై నుంచి తీస్తుండగా.. ఆ సంచి కిందపడింది. అంతే! ఒక్కసారిగా భారీ శబ్డంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘోరం జరిగింది. స్థానిక కేతిరెడ్డి కాలనీలో నివసిస్తున్న భవాని అనే మహిళకు మందు గుండు సామాగ్రి పేలడంతో తీవ్ర గాయాలయ్యాయి. భవన నిర్మాణ పనులు చేసుకునే ఆమె భర్తకు.. ఊరు చివరన ఓ ప్లాస్టిక్ సంచిలో మందు గుండు సామాగ్రి దొరికింది. దాన్ని అతడు ఇంటికి తీసుకొచ్చి అటకపై ఉంచాడు. అది కాస్తా అనుకోకుండా కిందపడటం.. భారీ పేలుడు సంభవించింది. స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో అశోక్ భార్య భవానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, బాధిత మహిళకు ప్రమాదంలో వినికిడి కోల్పోయినట్లు తెలుస్తోంది.