Viral News: రైలు పట్టాలపై కుప్పలుగా అమెజాన్ డెలివరీ ప్యాకెట్లు.. ఎందుకో తెలిస్తే షాక్.!

|

Jan 15, 2022 | 7:03 PM

అమెరికాలో సరుకు రవాణ రైళ్లపై దొంగలు దాడికి తెగబడుతున్నారు. రైళ్లు ఆగే ప్రాంతంలో దోపిడీలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో...

Viral News: రైలు పట్టాలపై కుప్పలుగా అమెజాన్ డెలివరీ ప్యాకెట్లు.. ఎందుకో తెలిస్తే షాక్.!
Amazon Delivery Boxes
Follow us on

అమెరికాలో సరుకు రవాణ రైళ్లపై దొంగలు దాడికి తెగబడుతున్నారు. రైళ్లు ఆగే ప్రాంతంలో దోపిడీలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన డజన్లకొద్ది పాకెట్లను ఎత్తుకుపోతున్నారు. లాస్‌ ఏంజెల్స్‌ నగరంలో ఈ తరహా దాడులు ఎక్కువయ్యాయి. రైలు పట్టాలపై కొన్ని వేల ఆన్‌లైన్‌ ప్యాకేజ్‌లు పడి ఉండటాన్ని చూసి రైల్వే సంస్థ కంగుతింది. దొంగల ముఠా దెబ్బకు ఆన్‌లైన వ్యాపార సంస్థలు అమెజాన్‌, ఫెడ్‌ఎక్స్‌ లాంటివి భారీగా నష్టపోతున్నాయి.

ఈ దొంగతనాలకు అడ్డుకట్టవేయడానికి డ్రోన్‌లతో నిఘా చర్యలను బలోపేతం చేసింది యూనియన్ పసిఫిక్ రైల్వేసంస్థ. మరింత మంది భద్రతా సిబ్బందిని నియమించింది. కాగా.. దొంగల్ని పట్టుకున్న తర్వాత కోర్టు చిన్న నేరంగా పరిగణించి ఓ మోస్తరు జరిమానా విధించి వదిలేయడంతో వాళ్లు 24 గంటల్లో బయటికొచ్చి మళ్ళీ దొంగతనాలు చేస్తున్నారని, విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులపై కూడా దాడులు చేస్తున్నారట. ఈ విషయమై శిక్షలు కఠినతరం చేయాలని యూనియన్‌ పసిఫిక్‌ సంస్థ.. లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీ అటార్నీ కార్యాలయానికి లేఖ రాసింది.

Also Read: 

Viral Photo: ఈ ఫోటోలో చిరుతను దాగుంది.. కనిపెడితే మీ కళ్లలో పదునున్నట్లే.!

Telangana: కరోనా ఆంక్షలు.. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు.?

Viral Photos: సముద్ర తీరంలో వింత ఆకృతులు.. రాత్రికి రాత్రే ఇలా.. విస్తుపోతున్న జనాలు..

Viral Video: ఖతర్నాక్ దొంగ.. స్కెచ్ మాములుగా లేదుగా.. ఫోన్ ఎలా కొట్టేశాడో చూస్తే ఫ్యూజులు ఔట్!