AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాజ్ మహల్ పై విమానాలు ఎందుకు ఎగరవో తెలుసా? కారణం ఇదేనట..!

ఈ పాలరాయి భవనాన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. దీనిని షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించాడు. తాజ్ మహల్ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలిసినప్పటికీ, తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తాజ్ మహల్ పై విమానాలు ఎగరడానికి అనుమతి లేదు. దీనికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

తాజ్ మహల్ పై విమానాలు ఎందుకు ఎగరవో తెలుసా? కారణం ఇదేనట..!
Taj Mahal
Jyothi Gadda
|

Updated on: Aug 21, 2025 | 12:45 PM

Share

తాజ్ మహల్.. ప్రపంచంలోని 7 వింతలలో ఒకటి. ఇది భారతదేశంలోని ఆగ్రాలో ఉన్న ఒక అద్భుతమైన స్మారక చిహ్నం. ఇది పూర్తిగా పాలరాయితో నిర్మించబడింది. ఇది ఆగ్రా నగరంలోని యమునా నది ఒడ్డున నిర్మించబడింది. ఇది ప్రేమకు చిహ్నంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించాడు. తాజ్ మహల్ మొఘల్ వాస్తుశిల్పానికి ఒక కళాఖండంగా పరిగణించబడుతుంది. ఇది పర్షియన్, భారతీయ, ముస్లిం నిర్మాణ శైలుల మిశ్రమం. 1983లో తాజ్ మహల్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.

ఈ పాలరాయి భవనాన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. దీనిని షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించాడు. తాజ్ మహల్ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలిసినప్పటికీ, తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తాజ్ మహల్ పై విమానాలు ఎగరడానికి అనుమతి లేదు. దీనికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఈ పాలరాయి భవనాన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. దీనిని షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించాడు. తాజ్ మహల్ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలిసినప్పటికీ, తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తాజ్ మహల్ పై విమానాలు ఎగరడానికి అనుమతి లేదు. దీనికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి

తాజ్ మహల్ మీదుగా విమానాలను నిషేధించారు. తాజ్ మహల్, దాని చుట్టూ ఉన్న దాదాపు 7 కిలోమీటర్ల ప్రాంతం మీదుగా విమానాలను నిషేధించారు. భారతదేశంలోని ప్రసిద్ధ తాజ్ మహల్‌ను 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. నాటి నుండి దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తాజ్ మహల్‌ను సందర్శిస్తారు. తాజ్ మహల్ సందర్శించే పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, 2006లో దీనిని నో-ఫ్లై జోన్‌గా ప్రకటించారు. తాజ్ మహల్ ప్రాంతంలో జరిగే రద్దీ, ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..