వెజ్ మీల్‌లో చికెన్ ముక్కలు..! ఎయిరిండియాపై మహిళ ప్రయాణికురాలు ఫైర్.. ఏం చేసిందంటే..

|

Jan 12, 2024 | 12:04 PM

అయితే, విమానంలో ఆహారం లేదా దాని నాణ్యతపై వివాదం ఏర్పడడం ఇదే మొదటిసారి కాదు. ఇది చాలా సందర్భాలలో అనేక విమానయాన సంస్థలతో ఇంతకు ముందు ఇలాగే జరిగింది. ఆహారంలో బొద్దింకలు కనిపించడం నుంచి ఆహారం పాడైపోవడం వరకు అనేక రకాల వివాదాలు వెలుగులోకి వచ్చాయి. తరచూ ఇలాంటి ఘటనల నేపథ్యంలో విమాన ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వెజ్ మీల్‌లో చికెన్ ముక్కలు..! ఎయిరిండియాపై మహిళ ప్రయాణికురాలు ఫైర్.. ఏం చేసిందంటే..
Veg Meal Chicken
Follow us on

ఎయిరిండియా ప్రయాణంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. విమానంలో వెజ్ భోజనం ఆర్డర్ ఇచ్చిన మహిళకు షాకింగ్‌ సీన్‌ ఎదురైంది..! వెజ్‌ భోజనంలో చికెన్ ముక్కలు ఉన్నాయని ఓ మహిళా ప్రయాణికురాలు ఆరోపించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సదరు మహిళా ప్రయాణికురాలు సోషల్ మీడియాలో షేర్‌ చేయగా వైరల్ అవుతోంది. ఈ విషయంలో ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పినా వివాదం అంత త్వరగా చల్లారేలా కనిపించడం లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వీర జైన్ అనే మహిళ ఎయిరిండియాకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్‌ చేశారు. తాను చెప్పిన శాకాహారంలో కొన్ని చికెన్ ముక్కలు ఉండడం ఆ ఫోటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా ప్రయాణీకురాలు తన పోస్ట్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఈ రకమైన చర్య మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బాధిత మహిళ వాపోయింది. ఈ సంఘటన గురించి విమానంలో ఉన్న సిబ్బందికి సమాచారం ఇచ్చానని చెప్పింది. అప్పుడు ఒక మహిళా సిబ్బంది క్షమాపణ చెప్పినట్టుగా వివరించింది. అయితే, తనకు మాత్రమే కాదు..ఆమె వంటి చాలా మంది ప్రయాణికులు వెజ్ మీల్స్ కోసం అడిగినప్పటికీ, నిర్లక్ష్యంగా సప్లై చేశారని ఆరోపించారు. ప్రస్తుతానికి, ఎయిర్ ఇండియా ఈ విషయంలో క్షమాపణలు చెప్పింది. మహిళా ప్రయాణీకురాలిని వ్యక్తిగతంగా సంప్రదించమని కోరింది.

ఇవి కూడా చదవండి

అయితే, విమానంలో ఆహారం లేదా దాని నాణ్యతపై వివాదం ఏర్పడడం ఇదే మొదటిసారి కాదు. ఇది చాలా సందర్భాలలో అనేక విమానయాన సంస్థలతో ఇంతకు ముందు ఇలాగే జరిగింది. ఆహారంలో బొద్దింకలు కనిపించడం నుంచి ఆహారం పాడైపోవడం వరకు అనేక రకాల వివాదాలు వెలుగులోకి వచ్చాయి. తరచూ ఇలాంటి ఘటనల నేపథ్యంలో విమాన ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..