Video Viral: గాలి మాటలు కాదండోయ్.. గాలినే అమ్మేస్తున్నాడు.. యువకుడి ఐడియాకు నివ్వెరపోతున్న నెటిజన్లు

|

Sep 09, 2022 | 7:21 PM

ఈ ప్రకృతిలో లభించే ప్రతీ వస్తువు అపురూపమైనదే. ఫ్రీగా వస్తుంది కదా అని అవసరానికి మించి వాడేస్తే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. ఉచితంగా లభించే నీళ్లు ఇప్పుడు చాలా ఖరీదైపోయాయి. డబ్బులు పెడితే గానీ సురక్షితమైన తాగు...

Video Viral: గాలి మాటలు కాదండోయ్.. గాలినే అమ్మేస్తున్నాడు.. యువకుడి ఐడియాకు నివ్వెరపోతున్న నెటిజన్లు
Air Sale
Follow us on

ఈ ప్రకృతిలో లభించే ప్రతీ వస్తువు అపురూపమైనదే. ఫ్రీగా వస్తుంది కదా అని అవసరానికి మించి వాడేస్తే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. ఉచితంగా లభించే నీళ్లు ఇప్పుడు చాలా ఖరీదైపోయాయి. డబ్బులు పెడితే గానీ సురక్షితమైన తాగు నీరు లభించని పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఈ క్రమంలోనే మానవులకు అత్యంత ఆవశ్యకమైన గాలి కూడా ఖరీదైపోతోంది. కాలుష్యం కారణంగా స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోయింది. దీంతో కొలంబియాకు చెందిన ఓ యువకుడు ఎవరూ ఊహించని ఓ కొత్త రకం వ్యాపారానికి తెర తీశాడు. కంటికి కనిపించని గాలిని బాటిళ్లలో నింపి అమ్మేస్తున్నాడు. ఫ్రీగా దొరికే గాలిని అమ్మి డబ్బులు పోగేసుకుంటున్నాడు. కొలంబియాలోని మెడలిన్‌ ప్రాంతం అద్భుతమైన వాతావరణానికి పేరు. దీనిని సొమ్ము చేసుకోవడంపై దృష్టి పెట్టాడు జూవాన్‌ కార్లోస్‌ అల్వరాడో. ఇక్కడి సహజమైన, నాణ్యమైన గాలిని ఆస్వాదించండి అంటూ గాలి నింపిన బాటిళ్లను పర్యాటకులకు విక్రయించడం స్టార్ట్ చేశాడు. తన గాలి బాటిళ్లకు ‘మెడలిన్‌ ఎయిర్‌’ అని బ్రాండ్‌ నేమ్‌ కూడా పెట్టేశాడు. బాటిళ్లలో గాలి ఏంటి అంటూ అనేకమంది విమర్శించినా వాటన్నిటీ గాలికే వదిలేసి తన బిజినెస్‌ కంటిన్యూ చేస్తున్నాడు జూవాన్.

బాటిళ్లలో గాలిని నింపడం అంత ఈజీ కాదని, అందుకోసం తాను ఒక ప్రత్యేక పరికరాన్ని కూడా తయారు చేశానని చెప్పుకొచ్చాడు. గాలిని శుద్ధి చేసి, ఒక బాటిల్ నింపడానికి అర్ధ గంట సమయం పడుతుందని చెబుతున్నాడు. ఒక్కో బాటిల్ ను ఐదు డాలర్లకు అంటే సుమారు 400 రూపాయలకు అమ్మతున్నాడు. మొదట్లో నామామాత్రంగా ఉండే బిజినెస్ ఇప్పడు వేగం పుంజుకున్నాయి. రోజుకు వందల సంఖ్యలో ఎయిర్ బాటిళ్లను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇదేదో సరదాగా ఉందని కొందరు బాటిళ్లను కొంటుంటే మరికొందరు వింతగా చూస్తున్నారు. ఇక చాలా మంది కార్లోస్ ఖాళీ బాటిళ్లను అమ్ముతూ మోసం చేస్తున్నాడని విమర్శిస్తున్నారు కూడా. అయినా అతడి దందా మాత్రం సాగుతూనే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..