Viral: సరదాగా అమ్మను రెస్టారెంట్ కు తీసుకెళ్లాడు.. ఐస్ క్రీం కొనిపెడితే ఊహించని సమాధానం

| Edited By: Anil kumar poka

Jul 15, 2022 | 3:03 PM

ఉద్యోగం కోసమో, చదువు కోసమో, వివిధ పనుల కోసమో కొన్నిసార్లు సొంతూరిని వదిలి నగరాలకు రావాల్సిన అవసరం ఉంటుంది. నగరాల్లో జీవన విధానం, లైఫ్ స్టైల్, కాస్ట్లీ లైఫ్ అనేది సాధారణంగా మారిపోయింది. కానీ గ్రామాల్లో, చిన్న స్థాయి పట్టణాల్లో అలా కాదు..

Viral: సరదాగా అమ్మను రెస్టారెంట్ కు తీసుకెళ్లాడు.. ఐస్ క్రీం కొనిపెడితే ఊహించని సమాధానం
Ice Cream Viral Video
Follow us on

ఉద్యోగం కోసమో, చదువు కోసమో, వివిధ పనుల కోసమో కొన్నిసార్లు సొంతూరిని వదిలి నగరాలకు రావాల్సిన అవసరం ఉంటుంది. నగరాల్లో జీవన విధానం, లైఫ్ స్టైల్, కాస్ట్లీ లైఫ్ అనేది సాధారణంగా మారిపోయింది. కానీ గ్రామాల్లో, చిన్న స్థాయి పట్టణాల్లో అలా కాదు. తక్కువ ధరలకే అన్ని రకాల వస్తువులు లభ్యమవుతాయి. కొన్ని వస్తువులకైతే డబ్బు అవసరం కూడా రాకపోవచ్చు. ఈ బిజీ లైఫ్ లో అమ్మానాన్నలను దూరంగా వదిలేసి వేరే ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుంది. వారితో గడిపే సమయం కాస్త తక్కువగానే ఉంటుంది. ఆ తక్కువ సమయాన్ని వీలైనంత మధురంగా మార్చుకోవాలనుకుంటూ ఉంటారు. వారిని సిటీకి తీసుకెళ్లి నచ్చినవి కొనిపెట్టడం, వారు సంతోషపడేలా చేయడం మనకు ఎంతో సంతృప్తి ఇస్తాయి. ఇలా పేరెంట్స్‌ను బయటకు తీసుకెళ్లిన ప్రతిసారీ నాన్న కాస్త సైలెంట్‌గానే ఉన్నా, అమ్మ మాత్రం తెగ వాయించేస్తుంది. ఇంత ఖర్చు పెట్టటం ఎందుకని తియ్యగా కసురుకుంటుంది. ఆ మాటలు విని నవ్వుకుంటూ ఎంజాయ్ చేయడం తప్ప ఏమీ అనలేం. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఓ యువకుడు రెస్టారెంట్ కు తన తల్లిదండ్రులను తీసుకెళ్తాడు. ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసి, తల్లికి అందించాడు. ఆ రుచిని ఆస్వాదిస్తున్న ఆమె ఐస్ క్రీం కాస్ట్ ఎంత అని అడిగింది. రూ.300 అని ఆ యువకుడు చెప్పాడు. దీంతో ఆమె వెంటనే ఫన్నీ రిప్లై ఇచ్చింది. ఇవే డబ్బులు పెడితే నాలుగు రోజులకు సరిపడా కూరగాయలు వస్తాయి కదా అని చెప్పి నవ్వేసింది. ఈ సంఘటనను వీడియో వీడియో తీసిన యువకుడు.. ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు. పేరెంట్స్‌కి ఏమైనా కొనిస్తే, దాని కాస్ట్ ఎంతో మాత్రం చెప్పకండి అని ట్యాగ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పటివరకు 39 లక్షల మంది చూశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. పలువురు వివిధ రకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి