యూట్యూబర్ అర్మాన్ మాలిక్ .. తన ఇద్దరు భార్యలు పాయల్ మాలిక్, కృతిక మాలిక్ లతో కలిసి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాదు వీరు ప్రతిరోజూ ఏదో ఒక వీడియోను షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా మరో యూట్యూబర్ కథ ఇంటర్నెట్‌లో వెలుగులోకి వచ్చింది. యూట్యూబర్ అర్మాన్ మాలిక్ లాగా మరో యూట్యూబర్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రస్తుతం సన్నీ రాజ్‌పుత్ గురించి మాట్లాడటం.. అతనికి సంబంధించిన వీడియో గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
సన్నీ తన ఫ్యామిలీతో యూట్యూబ్‌ని నడుపుతోంది. సన్నీ 227,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు అతని భార్యలు రూప, మాన్సీ ఇద్దరికీ కూడా వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. సన్నీ డిజిటల్ కంటెంట్ మేకర్.. అతను తనను తాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అభివర్ణించుకున్నాడు. అయితే సన్నీని .. అర్మాన్ కాపీ అని పిలుస్తున్నారు. అర్మాన్ లా సన్నీకి కూడా మొదటి భార్యతో ఒక బిడ్డను కలిగి ఉన్నాడు. తాజాగా సన్నీ ఓ వీడియోను విడుదల చేసి తన విశేషాలను నెటిజన్లతో పంచుకున్నాడు.
తన ప్రేమకథ గురించి సన్నీ వివరిస్తూ.. మొదట మాన్సీని కాలేజీలో కలిశానని.. అక్కడ మా ఇద్దరి పరిచయం స్నేహంగా మారింది.. తర్వాత ఒకరినొకరం ఇష్టపడడం.. ప్రేమించుకున్నామని చెప్పారు. అయితే తమ ప్రేమ కథ కూడా సినిమా స్టోరీ మాదిరిగానే తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని చెప్పాడు సన్నీ.. అంతేకాదు కొన్నాళ్ల తర్వాత ఫ్యామిలీ చూసిన రూపతో పెళ్లి జరిగింది. ఇద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. అయితే తన మనసులో మాన్సీపై ప్రేమ గుర్తుకొస్తునే ఉంది. అందుకే తన భార్యకు మాన్సీ గురించి అంతా చెప్పాడు.
మరో అమ్మాయిపై తన మనసులోని ప్రేమను గుర్తించి తన భార్య రూప.. భర్త సన్నీని ప్రేమించడానికి అనుమతినిచ్చింది. అయితే సన్నీ మాన్పిలు రెండో పెళ్లి చేసుకున్నా.. తాను విడాకులు ఇవ్వనని కండిషన్ పెట్టింది. సన్నీ కూడా ఏమి జరిగినా రూపకు విడాకులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో మాన్పి ని సన్నీ రెండో పెళ్లి చేసుకున్నాడు.
మాన్సీ, రూపలు ఒకరినొకరు సోదరీమణుల వలె ప్రేమించుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు ముగ్గురూ కూడా అర్మాన్ మాలిక్ లాగా జీవిస్తున్నారు. అయితే.. సన్నీ జీవనశైలి తెలిసిన నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..