Watch: వార్నీ..వీళ్లు చిచ్చర పిడుగులే..! ఒక సైకిల్ ఒకేసారి ఇద్దరు తొక్కుకుంటూ వెళ్తున్న తీరు చూస్తే అవాక్కే..!

|

Jun 02, 2023 | 8:58 PM

ఎందుకంటే దానికి ఒక్కటే సీటు ఉంటుంది. వెనుక క్యారేజ్ సీటుపై కూర్చున్న వారు వీలైతే పెడల్స్ పై తమ కాళ్లను సపోర్ట్ గా వేసి సైకిల్‌ తొక్కుతున్న వారికి సాయం చేయొచ్చు. అంతేగానీ, ఒకే సైకిల్‌ను ఒకే సారి ఇద్దరు తొక్కటం ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా..? అంతేకాదు.. ఈ వీడియో చూస్తే అసలైన టీమ్ వర్క్ కి సరైన అర్థం ఇదే అంటారు మీరుకూడా.

Watch: వార్నీ..వీళ్లు చిచ్చర పిడుగులే..! ఒక సైకిల్ ఒకేసారి ఇద్దరు తొక్కుకుంటూ వెళ్తున్న తీరు చూస్తే అవాక్కే..!
Two Boys Riding A Bicycle
Follow us on

దాదాపు సైకిల్‌ అందరూ తొక్కే ఉంటారు. రెండు చక్రాలు కలిగిన ఈ వాహనం పైసా ఖర్చు లేకుండా సురక్షితమైన ప్రయాణం చెయొచ్చు. ఇకపోతే, ఇలాంటి సైకిల్ ను సాధారణంగా ఒక్కరే ఏకకాలంలో తొక్కగలరు. ఎందుకంటే దానికి ఒక్కటే సీటు ఉంటుంది. వెనుక క్యారేజ్ సీటుపై కూర్చున్న వారు వీలైతే పెడల్స్ పై తమ కాళ్లను సపోర్ట్ గా వేసి సైకిల్‌ తొక్కుతున్న వారికి సాయం చేయొచ్చు. అంతేగానీ, ఒకే సైకిల్‌ను ఒకే సారి ఇద్దరు తొక్కటం ఎక్కడైనా, ఎప్పుడైనా చూశారా..? అంతేకాదు.. ఈ వీడియో చూస్తే అసలైన టీమ్ వర్క్ కి సరైన అర్థం ఇదే అంటారు మీరుకూడా. ప్రస్తుతం ట్విట్టర్ లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఇద్దరు అబ్బాయిలు ఒకేసారి రెండు పెడల్స్ ఉన్న సైకిల్ ని ఒకేసారి తొక్కుకుంటూ దూసుకుపోతున్నారు. చెరో పైడల్‌పై నిల్చున్న చిన్నారులు వేగంగా సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్తున్నారు. పైగా అలా సైకిల్‌ తొక్కే సమయంలో వారు ఎలాంటి తడబాటు పడకుండా చాలా సంతోషంగా, ఉత్సాహంగా తొక్కుకుంటూ వెళ్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకి 1.7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేశారు. ఆ పిల్లలను చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. చాలా మంది వారి ప్రతిభను చూసి మురిసిపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..