సోషల్ మీడియా.. అందమైన జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకునేందుకు ఉపయోగపడుతుంది. నెట్టింట్లో షేర్ చేసే ప్రతి ఫోటో.. ఆ రోజు తాలుకా తీపి జ్ఞాపకాలను కళ్ల ముందుకు తీసుకువస్తుంది. అందుకే అంటారు గడిచిన రోజుల ఆనంద క్షణాలను ఫోటోస్ మాత్రమే కళ్లముందుకు తీసుకురాగలవని. ఇప్పుడు ఆ జ్ఞాపకాలను షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సెలబ్రెటీలు.. తమ చిన్ననాటి ఫోటోలు.. అరుదైన ఫోటోలను నెట్టింట్లో ఎక్కువగా షేర్ చేస్తున్నారు.
ఇక త్రోబ్యాక్ పిక్చర్ ట్రెండ్‌కు నెటిజన్స్ సైతం తెగ అట్రాక్ట్ అయ్యారు. తమ అభిమాన నటీనటులు చిన్నప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి.. వారిని గుర్తుపట్టేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఇటీవల గత కొద్ది రోజులుగా పూజా హెగ్డే, సాయి పల్లవి, రష్మిక మందన్నా.. ఇలా చాలా మంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో హీరోయిన్ ఫోటో కూడా తెగ వైరల్ అవుతుంది. పైన ఫోటోలో తాతయ్యతో కలిసి ఉన్న ఆ బూరెబుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?
ఈ చిన్నారికి తెలుగులో ఫుల్ క్రేజ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ బుజ్జాయి.. ఇప్పటికీ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఎవరో చెప్పగలరా.. గుర్తుపట్టడం లేదా.. తను మరెవరో కాదండోయ్.. హీరోయిన్ రాశీ ఖన్నా. తెలుగులో అతి తక్కువ సమయంలో హిట్ అందుకుని ఫాంలో దూసుకుపోతున్న హీరోయిన్. ప్రస్తుతం నాగచైతన్య సరసన థ్యాంక్యు సినిమాలో నటిస్తోంది.